బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోకి ముహూర్తం ఫిక్స్
బాలయ్య రీసెంట్ గా డాకు మహారాజ్ తో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు. ఇప్పుడు బోయపాటితో కలిసి అఖండ 2లో యాక్ట్ చేస్తున్నారు. ప్రజంట్ ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా సాగుతుంది. రీసెంట్ గా హిమాలయాస్ లో అఘోరాలకు సంబంధించిన షెడ్యూల్ ని షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఇయర్ లో దసరా స్పెషల్ గా రిలీజ్ కు ప్లాన్ చేశారు. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయ్యింది.
వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని రీసెంట్ గా బాలయ్యకు స్టోరీ చెప్పగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. బాలయ్య బర్త్ డే స్పెషల్ గా జూన్ 10 న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్స్ డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఈ సినిమను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు. అఖండ 2 తర్వాత గోపిచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.