మురిపించిన ముంబై.. అదరగొట్టిన ఆర్సీబీ..

By Ravi
On
మురిపించిన ముంబై.. అదరగొట్టిన ఆర్సీబీ..

ఐపీఎల్‌లో చోటు చేసుకున్న రీసెంట్ మ్యాచ్ ముంబై వర్సెస్ బెంగుళూర్ అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. టాస్ గెలుచుకుని ముంబై ఫస్ట్ బౌలింగ్ ను సెలెక్ట్ చేసుకుని మంచి ఒపెనింగ్ ఇచ్చింది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ టీమ్ 20 ఓవర్స్ లో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. దీంతో ముంబై టీమ్ కి మంచి లక్ష్యాన్ని ఫిక్స్ చేసింది. బెంగుళూర్ టీమ్ లో విరాట్ కోహ్లీ 67 పరుగులు చేశారు. పడిక్కల్ 37 తో ఔట్ అయ్యారు. పటిదార్ 64 తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. నెక్ట్స్ జితేష్ శర్మ 40 కి నాటౌట్ గా నిలిచారు. దీంతో మొత్తం బెంగళూర్ టీమ్ 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

నెక్ట్స్ బ్యాటింగ్ తో బరిలోకి దిగిన ముంబై టీమ్ ఓపెనర్స్ చాలా తక్కువ టైమ్, తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ డౌట్ అవుతున్నా.. ముంబై టీమ్ స్కోర్ మాత్రం పరుగులు పెడుతూ కనిపించింది. ఇక తిలక్ వర్మ 56 పరుగులు చేశారు. హార్ధిక్ పాండ్య 42 పరుగులు సాధించారు. ఫైనల్ గా 20 ఓవర్లకు గాను ముంబై టీమ్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో ముంబై మురిపించినా.. ఆర్సీబీ 12 పరుగుల తేడాతో అదరగొట్టింది.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!