అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ పై వెయిటింగ్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఈరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు ఇంకా సినీ సెలెబ్రిటీస్ నుండి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మరి అల్లు అర్జున్ బర్త్ డే అంటే ఖచ్చితంగా ఆయన లైనప్స్ నుండి ఏదైనా స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్ వస్తుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న సినిమాపైనే ఈ హైప్ మరింతగా క్రియేట్ అయ్యింది. కొన్నాళ్ల నుండి ఈ ప్రాజెక్ట్ పై ఊహాగానాలు ఎక్కువైనా.. సన్ పిక్చర్స్ బ్యానర్ వారు కూడా కొన్ని హింట్స్ ఇస్తున్నా.. ఎక్కడా ఎలాంటి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ లేదు.
మరి ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గానైనా ఏదైనా సర్ ప్రైజ్ రివీల్ చేస్తారా అనే విషయంపై అందరి కళ్లు ఉన్నాయి. అయితే సినీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం వీరి కాంబినేషన్ ఆల్ మోస్ట్ సెట్ అయినట్లే. మరి వీరి నుండి వచ్చే అప్డేట్ కూడా మంచి హైప్ ని క్రియేట్ చేస్తుందని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ క్రేజీ కాంబో ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.