న‌గ‌రంలో విద్యుత్ వాహ‌నాల ఛార్జింగ్ స్టేష‌న్ ప్రారంభం

By Ravi
On
న‌గ‌రంలో విద్యుత్ వాహ‌నాల ఛార్జింగ్ స్టేష‌న్ ప్రారంభం

 

  • ప్రైవేటు భాగ‌స్వామ్యంతో ఏర్పాటు చేసిన ఇ.పి.డి.సి.ఎల్‌.
  • విద్యుత్ వాహ‌నాల వినియోగాన్ని ప్రోత్స‌హించేందుకే ఛార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటు
  • తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ సి.ఎం.డి. పృథ్వీతేజ్‌

విజయనగరం : విద్యుత్ వాహ‌నాల‌ను ప్రోత్స‌హించాల‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ క్లీన్ ఎన‌ర్జీ విధానంలో భాగంగా తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వ‌ర్యంలో విద్యుత్ వాహ‌నాల ఛార్జింగ్ స్టేష‌న్ల‌ను ప్రైవేటు భాగ‌స్వామ్యంతో పిపిపి విధానంలో ఏర్పాటు చేస్తున్న‌ట్టు సంస్థ సి.ఎం.డి. ఇమ్మడి పృథ్వీతేజ్ చెప్పారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వ‌ర్యంలో ప‌ది విద్యుత్ ఛార్జింగ్ స్టేష‌న్‌ల‌ను పైల‌ట్ విధానంలో త‌మ విద్యుత్ స‌బ్‌స్టేష‌న్ల వ‌ద్ద ప్రైవేటు సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నామ‌ని దీనిలో మొద‌టి ఛార్జింగ్ స్టేష‌న్ విజ‌య‌న‌గ‌రంలో ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ‌, వి.ఎన్‌.గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రైజెస్ సంస్థ‌తో క‌ల‌సి న‌గ‌రంలోని పాత జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా విశాఖ రోడ్డులో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహ‌నాల ఛార్జింగ్ స్టేష‌న్‌ను సి.ఎం.డి. శుక్ర‌వారం ప్రారంభించారు.

విద్యుత్ వాహ‌నాల వినియోగాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా రాష్ట్రంలో వ‌చ్చే ఐదేళ్లలో ఐదు వేల విద్యుత్ ఛార్జింగ్ స్టేష‌న్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష్యాన్ని నిర్దేశించార‌ని దీనిలో భాగంగా  ఇ.పి.డి.సి.ఎల్‌. ఆధ్వ‌ర్యంలో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. పి.ఎం.సూర్య‌ఘ‌ర్ లో భాగంగా ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌దివేల మంది ఎస్‌.సి., ఎస్‌.టి. వ‌ర్గాల ఇళ్ల‌కు సౌర‌విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. వారికి ఇంటిపైక‌ప్పుపై ఏర్పాటుకు స్థ‌లం వుంటే ఇంటిపైనే ఏర్పాటు చేస్తామ‌ని, స్థ‌లం లేని ప‌క్షంలో ఇంటికి ద‌గ్గ‌ర‌లో వుండే ఖాళీస్థ‌లంలో ఏర్పాటు చేస్తామ‌న్నారు.  త‌మ సంస్థ ప‌రిధిలోని జిల్లాల్లో ఇప్ప‌టివ‌ర‌కు 7,800 సూర్య‌ఘ‌ర్ యూనిట్లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. యీ జిల్లాలో 700 వ‌ర‌కు యూనిట్లు ఏర్పాటైనట్లు చెప్పారు. ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డం జ‌రిగింద‌ని, పోర్ట‌ల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకొంటే త్వ‌ర‌గా యూనిట్లు ఏర్పాటు చేయ‌డం జ‌ర‌గుతుంద‌న్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!