నాగాంజలి మరణం బాధాకరం
TPN, Sri Ch
Rajamahendravaram, April 04
- ఆమె ఆఖరి కోరిక ప్రకారం దీపక్ కి కఠిన శిక్ష పడాలి ...
- ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి ...
- హాస్పటల్ యాజమాన్యం కూడా సాయం అందించాలి....
- న్యాయం జరిగేవరకు అండగా ఉంటాం : మాజీ ఎంపీ భరత్.
నాగాంజలి మరణం అత్యంత బాధాకరమని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. ఆమె మరణవార్త తెలుసుకుని పోస్ట్ మార్టం చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగాంజలి కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితురాలు సూసైడ్ నోట్ లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. దీపక్ కి కఠినాతి కఠిన శిక్ష పడాలని నాగాంజలి కోరుకుందని, అది నెరేవేరే విధంగా చర్యలు తీసుకోవాలని భరత్ డిమాండ్ చేసారు. దీపక్ లాంటి కీచకులకు తగిన శిక్ష విధించడం ద్వారా ఇలాంటి ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నాగాంజలి కుటుంబాన్ని ఆదుకోడానికి ప్రభుత్వం , కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆసుపత్రి యాజమాన్యం కూడా సాయం అందించాలని భరత్ డిమాండ్ చేసారు. తానేదో రాజకీయం చేస్తున్నట్లు కొందరు పేర్కొనడం తగదని భరత్ పేర్కొన్నారు. ఆరోజు విద్యార్థులు ధర్నా చేస్తునన్నపుడు తెలుసుకుని వెళ్లానని ఆయన అన్నారు. తానె స్వయంగా ఇంజక్షన్ చేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందా , ఎవరైనా ఇంజక్షన్ చేసారా అనే అనుమానాస్పద ఘటన నేపథ్యంలో ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిగేవరకు అండగా ఉండాలని భావించామని భరత్ పేర్కొన్నారు. అపుడే విషయం బయటకు వచ్చిందని, లేకుంటే ఆరోజు సాయంత్రమే చక్కబెట్టేసి ఉండేవారని ఆయన అన్నారు. ఎందుకంటే విషయం బయటకు వచ్చాకే దీపక్ పై కఠిన సెక్షన్లు పెట్టారన్నారు.
పోలీసు శాఖను మమేకం చేస్తూ, గతంలోతాము దిశ యాప్ తీసుకొచ్చామని భరత్ గుర్తుచేశారు. ఇప్పుడు శక్తి యాప్ తెచ్చి ఉపయోగం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ ఘటనపై హోం మంత్రి కూడా స్పందించకపోవడం, కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం దారుణమని ఆయన అన్నారు. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకు ఇచ్చే గౌరవం ఈమాదిరిగా ఉందో అర్ధం అవుతోందని భరత్ అన్నారు. ఆర్ధిక సాయం చేస్తున్నట్లు ఎవరివరో చెప్పడం వింతగా ఉందన్నారు. అలా ఇచ్చే సాయం ఎక్కడ నుంచి ఇస్తున్నారో చెప్పాలని భరత్ డిమాండ్ చేసారు. ఒకవేళ నిందితుడు నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి ఇస్తున్నారంటే, అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలన్నారు.