తిరుపతిలో జరిగే  ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...

By Ravi
On
తిరుపతిలో జరిగే  ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...

ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు  మొజ్జాడ యుగంధర్...

 
మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు  తిరుపతి నగరంలో జరిగే ఏఐవైఎఫ్  17వ జాతీయ మహాసభలను  జయప్రదం చేయాలని  ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. ఈరోజు శ్రీకాకుళం స్థానిక సిపిఐ పార్టీ ఆఫీసులో  జాతీయ మహాసభలకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ నలుమూలల నుండి జాతీయ మహాసభలో యువత పాల్గొంటారని, 29 రాష్ట్రాల నుండి జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా  హాజరవుతారని అన్నారు. మే 15వ తేదీ వేలాదిమంది యువతతో ర్యాలీ, బహిరంగ సభ  ఏర్పాటు చేయడం జరుగుతుందని అదేవిధంగా మే 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రతినిధుల సభ  నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న  ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ తన మాటను గాలికొదేశారని  అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య ను పరిష్కారం చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా  ప్రైవేటు పరం చేస్తూ  కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని  అన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ ద్వారా  దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. యువజన హక్కుల సాధనకై ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే దిశగా  ప్రభుత్వాలు పనిచేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు  అరవింద్, వాసు, క్రాంతి, హరి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!