ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు...
MAHESH, MANDAPETA, TPN
ద్విచక్రవాహనదారులు ప్రతిఒక్కరూ శిరస్త్రాణం ధరించాలి బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా బిజెపి ఉపాద్యక్షులు కోనసత్యనారాయణ ప్రభుత్వ నిభందనలు అందరూ పాటించి ప్రభుత్వం,అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అందరూ హెల్మెట్ ధరించేలా పటిష్ఠమైన చర్యలు చేపటి అధికారులు పట్టణ ఔట్ కట్స్ లో వాహన చెకింగ్ లు నిర్వహించి త్రిపల్ రైడింగ్,మైనర్లపై కఠిన చర్యలు తీసుకుని హెల్మెట్ ధరించని వార్కి అవగాహనకల్పిస్తు, ఫెనాల్టీ వసూలుచేసి ఆడబ్బుతోనే హెల్మెట్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశ వ్యాప్తంగా ఏటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ద్విచక్ర వాహన విక్రేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు.మంత్రి ప్రకటనకు టూ వీలర్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీహెచ్‌ఎంఏ) సంపూర్ణ మద్దతు తెలియజేసింది. తాజా నిర్ణయంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ఇద్దరూ హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. దీంతో ద్విచక్ర వాహన విక్రేతలు నూతన బైక్ కొనుగోలు సమయంలోనే రెండు హెల్మెట్‌లను విక్రయించనున్నారు.ప్రతివాహనదారుడు ప్రభుత్వ నియమ నిభంధనలు పాటించాలని కోరారు...