దుష్ప్రచారాలు తగదు - వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి
నెల్లూరు : నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి మీద నమోదైన మైనింగ్ కేసులో A1, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తను అప్రూవర్ గా మారినట్లు కొన్ని ఎల్లో చానెల్స్ లో దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. కేసులు పెడితే భయపడి వెనక్కి తగ్గే రకం కాదని, ఎప్పటికీ అధినేత జగన్ తోనే ఉంటామన్నారు . .మాజీ మంత్రి కాకాని మీద నమోదైన అక్రమ కేసులో నన్ను A1 గా చేర్చారు. ఫిబ్రవరి 16న నన్ను నిందితుడిగా చేర్చితే 24వ తేదీ నాకు బెయిల్ వచ్చిందన్నారు. రస్తుం మైన్స్ మీద మైనింగ్ అధికారులకే క్లారిటీ లేదు ఈ కేసులో ఉన్న వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులకి మైనింగ్ DD షోకాజ్ నోటీసులు ఇచ్చాడన్నారు. 7కోట్ల 56 లక్షల పెనాల్టీ వేశారన్నారు. ప్రస్తుత మైనింగ్ DD బాలాజీ నాయక్ నా పేరు కూడా చేర్చి.. నా మీద పోలీసులకు పిర్యాదు చేసారన్నారు. ఓనర్ కూడా లేని మైన్స్ లో అక్రమాలు జరిగాయని మాపై కేసు పెట్టడం దారుణమన్నారు.