రామచంద్రపురం నియోజకవర్గంలో నిత్యావసర సరుకుల పంపిణీ
Kukkala Govinda Raju..TPN
Ramachandrapuram..
శ్రీ పోలిశెట్టి లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో శ్రీమతి డొక్కా సీతమ్మ ఆసరా పథకం తరపున రామచంద్రపురం నియోజకవర్గం లో నిత్యావసర సరుకుల పంపిణీ.ఈరోజు కె.గంగవరం మండలంలో బోడే పుల్లయ్య,యండగండి తిరుకోటి రాజ్యలక్ష్మి,రాజావేరు గ్రామానికి చెందిన వారికి, కాజులూరు మండలంలో పోతురాజు సీతమ్మ,దుగ్గుదూరు మిరియాల పాపాయమ్మ,గొల్లపాలెం గ్రామానికి చెందిన వారికి రామచంద్రపురం మండలం లోని కాపా భూషణం,వేగాయమ్మపేట బొమ్ము సత్యనారాయణ, వేగాయమ్మపేట పలివెల రాజారావు,వెంకటాయపాలెం ,జల్లి కవలమ్మ,జగన్నాయకులపాలెం రామచంద్రపురం పట్టణంలో మర్రి వేంకటేశ్వర రావు,వైఎస్ఆర్ నగర్ దొమ్మలపాటి చిన్నారి,స్టీల్ వెల్ పేట గ్రామాలలో మరణించిన వాళ్ల కుటుంబ సభ్యులను ట్రస్ట్ ఛైర్మెన్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాలు మేరకు ఈరోజు జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ & నియోజకవర్గం ట్రస్ట్ కోఆర్డినేటర్ గుబ్బల శ్రీనివాస్, కె.గంగవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చిర్రా రాజకుమార్, పోలిశెట్టి పెదబాబు పరామర్శించి వారికి ట్రస్ట్ ద్వారా నిత్యవసర సరుకులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.