ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఏఐవైఎఫ్ నేతలు ఆందోళన
నరసన్నపేట, 28/03/2025
ఏఐవైఎఫ్ (ఆల్ ఇండియా యువ జన ఫెడరేషన్) 17వ జాతీయ మహాసభలలోగో శుక్రవారం నరసన్నపేట పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, ఏఐవైఎఫ్ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్షులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావు, సమగ్ర యువజన విధానం అమలులో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు.
"ప్రతి సంవత్సరం 2 కోట్లు ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ ప్రతిజ్ఞ అమలులో లేదు, దీంతో దేశంలో నిరుద్యోగం మరింత పెరుగుతోంది. మత రాజకీయాలు పెంచి యువతకు ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టడం లేదు" అని వారు అన్నారు.
ఈ సందర్భంగా, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి, యువతకు ఉపాధి కల్పించేందుకు భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
"ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, నిరుద్యోగులకు ఆదుకోవాలని" ఏఐవైఎఫ్ నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో, 2025లో మే 15-18 తేదీల మధ్య తిరుపతిలో నిర్వహించే 17వ జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని, ఆవకాశాల కోసం నిరుద్యోగులతో ప్రదర్శన కూడా నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వసంత్, వాసు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.