యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకం కోసమే ఒప్పందం

By Ravi
On
యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకం కోసమే ఒప్పందం

 

శంకర్ పల్లి, 25 మార్చి:

స్టార్టప్‌ల అభివృద్ధి మరియు యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఇక్ఫాయ్ ఇంక్యూబేటర్ మరియు టీ-హబ్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ మేరకు మంగళవారం శంకర్ మండలం దొంతాన్ పల్లిలోని క్యాంపస్‌లో ఇక్ఫాయ్ వైస్ ఛాన్సలర్ మరియు టీ-హబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్ జాగిర్దార్ ఎంవోయూ (మొమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్)పై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, "ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, యువ పారిశ్రామిక వేత్తలకు ఇక్ఫాయ్ ఒక మంచి వేదికగా మారతుందని" తెలిపారు. టీ-హబ్ నైపుణ్యంతో ఇక్ఫాయ్ విద్యా సంస్థల శక్తిని సమన్వయం చేసి స్టార్టప్‌ల ఆవిష్కరణ, శిక్షణ, నిధులు, మార్కెట్ యాక్సెస్ కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే, స్టార్టప్ ప్రాజెక్టులను ఇంటర్న్షిప్‌గా ఎంచుకునేందుకు విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తామన్నారు.

టీ-హబ్ సీఐవో సుజిత్ జాగిర్దార్ మాట్లాడుతూ, "స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో టీ-హబ్ ముందు వరుసలో ఉంటుందని, ఇక్ఫాయ్తో ఒప్పందం ద్వారా మరిన్ని వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే అవకాశం దక్కిందని" అన్నారు. పరిశోధన మరియు పారిశ్రామిక ఆవిష్కరణల మధ్య వారధిగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

ఇక్ఫాయ్ ఇంక్యుబేటర్ ఎక్టిక్యూటివ్ డైరెక్టర్ సాయినాథ్ మణికొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీ-హబ్ ప్రతినిధులు, సీనియర్ ఇన్వెస్టర్ స్టార్టప్ ఫండ్ డైరెక్టర్ దేవిశెట్టి చింటిరెడ్డి, చీఫ్ డెలివరీ ఆఫీసర్ ఫణి కొండెపూడి, ఇక్ఫాయ్ రిజిస్టార్ డాక్టర్ విజయలక్ష్మి, బ్రాండింగ్ డైరెక్టర్ సుధాకర్ రావు, డైరెక్టర్లు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!