30 వేల మంది పైలట్లు అవసరం. - మంత్రి రామ్మోహన్ నాయుడు

By Ravi
On
30 వేల మంది పైలట్లు అవసరం. - మంత్రి రామ్మోహన్ నాయుడు

వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణికుల సంఖ్య ఏటికేడు పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా విమానాలను సైతం ఆయా సంస్థలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పైలట్లు కూడా పెద్ద సంఖ్యలో అవసరమవుతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాబోయే 15-20 ఏళ్లలో సుమారు 30వేల మంది పైలట్లు అవసరం పడతారని పేర్కొన్నారు. 200 శిక్షణ విమానాల కొనుగోలుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.

దేశీయంగా 800కు పైగా విమానాలు సేవలందిస్తున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం 6,7 వేల మంది పైలట్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వివిధ కంపెనీలు 1700కు పైగా విమానాలకు ఆర్డర్ పెట్టాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అవి సేవలందించబోతున్నాయన్నారు. దీంతో రాబోయే 15-20 ఏళ్లలో 30 వేల మంది పైలట్లు అవసరమని చెప్పారు. భారత్ను ట్రైనింగ్ హబ్ కూడా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విమానయాన పరిశ్రమ కోసం మంత్రిత్వ శాఖ ఒక సమష్టి విధానంతో పనిచేస్తోందని చెప్పారు. 38 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ను తనిఖీ చేసి అధికారులు రేటింగ్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.


ఈరోజు ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా మరియు శక్తి ఎయిర్‌క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందలో భాగంగా  భారతదేశం యొక్క FTO లకు స్వదేశీంగా తయారు చేయబడిన శిక్షణా విమానాలను అందిస్తుంది, దిగుమతి ఆధారపడటాన్ని తగ్గిస్తుంది మరియు  విమానయాన శిక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శిక్షణా విమానాలు పైలట్ అభివృద్ధికి వెన్నెముక, మరియు ఈ చొరవ భారతదేశంలోని తదుపరి తరం నైపుణ్యం కలిగిన పైలట్‌లను శక్తివంతం చేయడంలో గేమ్-ఛేంజర్ గా భారత దేశం నిలుస్తుంది అని పౌర కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు తెలియజేశారు. ఈ ఎం ఓ యు కార్యక్రమానికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ జీ, శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ జీ (చైర్మన్, ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా), మరియు డాక్టర్ ఎం మాణికం జీ (శక్తి ఏవియేషన్ చైర్మన్) మొదలగున వారు హాజరయ్యారు.

Tags:

Advertisement

Latest News

20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు 20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్‌ ఇవ్వడానికి రూ.20 డిమాండ్‌ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...
శ్రీకాకుళం రూరల్ లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష
సామాన్యులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ 
ఎంబిబిఎస్ పట్టాదారులు ప్రభుత్వ సేవలో చేరాలి - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేటీఆర్ కు బల్మూర్ వెంకట్ కౌంటర్
బి.ఆర్.ఎస్ రజతోత్సవ పాటను  ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్ 
సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం