జిల్లా స్ధాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2025 

By Ravi
On
జిల్లా స్ధాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2025 

పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల స్ధాయి “వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2025” నిర్వహించడానికి నోడల్ కాలేజీ గా డి.ఎన్.ఆర్. కళాశాలను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఎన్నిక చేసినదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్  సి నాగరాణి తెలియచేసారు. దీనికీ సంబందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమములో డి.ఎన్.ఆర్. కళాశాల ఎన్.ఎస్.ఎస్.  ప్రోగ్రామ్ ఆఫీసర్లు శ్రీ ఎస్. అనిల్ దేవ్ గారు, శ్రీ కె. సోమయ్యగారు, ఈ భరత్ రాజు, పి.డి.ఆర్ సతీష్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల నుండి యూత్ పార్లమెంట్ కార్యక్రమములో పాల్గొనవలసిన వారు 18 నుండి 25 సంవత్సరాలు పూర్తి అయిన వారు పాల్గొనవచ్చని ముందుగా ప్రతీ ఒక్కరు  తప్పనిసరిగా mybharat.gov.in  పోర్టల్ లో తమ పేర్లను  నమెదు చేసుకొని, ఈ రెండు జిల్లాల వాళ్లు మై భారత్ పోర్టల్ లో పశ్చిమ గోదావరి జిల్లాగా ఎంచుకోవలసినదిగా, రాజ్యాంగం ద్వారా గుర్తింపు పొందిన ఏ భాషలోనైనా “what does Viksit Bharat mean to you? అనే అంశం పై ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోను వికిసిత్ భారత్ లింక్ లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు.  పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాలో  నమోదు చేయించుకున్న వారిలో 150 మందిని స్క్రీనింగ్ చెసి వారికి డి.ఎన్.ఆర్ కళాశాలలో పోటీలు నిర్వహించి 10 మందిని రాష్ట్ర స్ధాయికి ఎంపిక చేసి పంపుతారు .జిల్లా స్ధాయి (పశ్చిమ గోదావరి మరియు ఏలూరు) పోటీలలో పాల్గొనేందుకు నమోదు కు చివరి తేదీ మార్చి నెల 16వ తేదీ, సమయం రాత్రి 11:59 నిముషాల వరకు ఉంటుంది.నమోదు ప్రక్రియలో సహాయం కొరకు 8179179899, 9441388058 సాయంత్రం 4:30 వరకు సంప్రదించాలని తెలిపారు.
Tags:

Advertisement

Latest News

20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు 20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్‌ ఇవ్వడానికి రూ.20 డిమాండ్‌ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...
శ్రీకాకుళం రూరల్ లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష
సామాన్యులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ 
ఎంబిబిఎస్ పట్టాదారులు ప్రభుత్వ సేవలో చేరాలి - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేటీఆర్ కు బల్మూర్ వెంకట్ కౌంటర్
బి.ఆర్.ఎస్ రజతోత్సవ పాటను  ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్ 
సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం