కోహ్లీ కోసం కిలోమీటర్ల మేర క్యూ..!
టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. ఎంతగా అంటే.. ఆయన రంజీ మ్యాచ్ ఆడుతున్నాడని తెలిసి ఎన్నడూ లేనంతగా అభిమానులు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానానికి బారులు తీరారు.
విరాట్ కోహ్లీ నామస్మరణతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. కొంతకాలంగా టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్లో దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. కీలకమైన మ్యాచ్లలో ఓడిపోయింది. ఈ క్రమంలో జట్టును గాడిలో పెట్టడానికి బీసీసీఐ కొత్త రూల్స్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆటగాళ్లు మొత్తం దేశవాళీ క్రికెట్ ఆడాలని స్పష్టం చేసింది. దీంతో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, కేఎల్ రాహుల్ వంటి వారు రంజి మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో టి20 సిరీస్‌కు దూరంగా ఉన్నవారు కూడా రంజీ ట్రోఫీలో ఆడుతూ బిజీగా ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ మెడనొప్పితో మొదటి మ్యాచ్ ఆడలేదు. కానీ.. రైల్వేస్‌తో ప్రారంభమైన చివరి లీగ్ రంజీ మ్యాచ్లో ఢిల్లీ జట్టు తరఫున విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగాడు. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీగా వచ్చారు. వేలాది సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
ఉదయం 3 గంటల నుంచే స్టేడియం బయట బారులు తీరారు. కింగ్ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. ప్రేక్షకులు భారీగా రావడంతో ప్రతి స్టాండ్ కూడా నిండిపోయింది.. అయితే అయితే భద్రత కారణాలతో కొంతమంది అభిమానులను పోలీసులు మైదానంలోకి అనుమతించలేదు. మరోవైపు ఒక దేశవాళీ మ్యాచ్ కోసం ఈ స్థాయిలో ప్రేక్షకులు రావడం ఇదే తొలిసారని తెలుస్తోంది. స్టేడియానికి భారీగా ప్రేక్షకులు రావడంతో విరాట్ కోహ్లీ వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేక చాలా రోజులవుతోంది. అయినప్పటికీ జనాలు ఏమాత్రం తగ్గకుండా వచ్చారు. మరోవైపు కోహ్లీ రంగంలోకి దిగడంతో.. దానిని క్యాష్ చేసుకోవడానికి జియో సినిమా లైవ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మ్యాచ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు అభిమానులు కోహ్లీ పేరు స్మరిస్తున్నారు అంటే.. అతడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.