మాదాపూర్‌లో చైన్‌స్నాచింగ్‌..! 

By Ravi
On
మాదాపూర్‌లో చైన్‌స్నాచింగ్‌..! 

హైదరాబాద్‌ మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుట్టల బేగంపేట్ నవభారత్‌నగర్‌లో చైన్‌స్నాచింగ్‌ కలకలం రేపింది. బోరబండ నుంచి నడక దారిలో వెళ్తుండగా.. గుర్తు తెలియని దుండగుడు భాగ్యవతి అనే మహిళ మెడలోని గొలుసును బలవంతంగా లాక్కెళ్లాడు. ఈ ఘటన పట్టపగలు 10 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. బాధితురాలు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. తరచుగా నవభారత్ నగర్‌లో ఉన్న గుట్టల్లో ఏదో ఒకట సంఘటన జరుగుతూ ఉండడంతో.. మహిళలు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడుతున్నారు. గతంలో బోరబండ నుంచి నవభారత్ నగర్ మీదుగా కాకతీయ హెల్త్‌కు వెళ్లే దారి ఇది. ఐతే.. ఇరు వర్గాల మధ్య వివాదాలతో రోడ్డుకి అడ్డుకంచ వేయడంతో.. గుట్టల్లో నుంచి దారి గుండా వెళ్లే మహిళలపై తాగుబోతులు దాడికి ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా ఈ దారిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలని మహిళలు కోరుతున్నారు.

Advertisement