కార్పొరేషన్ రుణాలు సంక్షేమ పథకాలు టిడిపి నాయకులకే కేటాయించడంపై న్యాయ పోరాటం చేస్తాం

By Ravi
On
కార్పొరేషన్ రుణాలు సంక్షేమ పథకాలు టిడిపి నాయకులకే కేటాయించడంపై న్యాయ పోరాటం చేస్తాం

CH.SEKHAR TPN

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కార్పొరేషన్ రుణాలు సంక్షేమ పథకాలు నాయకులు కేటాయించాలంటూ అధికారులపై దేశం నాయకులు బెదిరింపులకు పాల్పడం అన్యాయమని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఎంపీడీవో త్రివిక్రమ రావు కి ఎంపీపీ ఎం సుబ్బలక్ష్మి, సర్పంచ్ సంఘ0 అధ్యక్షులు, నీర్ప కోట సర్పంచ్ ఆరణి విద్యా నాథ్ రెడ్డి పలువురు నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది., ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న కార్పొరేషన్ రుణాలు సంక్షేమ పథకాలు పార్టీలు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది పొందే వారన్నారు. కానీ నేడు మండలంలోని తెలుగుదేశం నాయకులు తీరు తేడాగా ఉందన్నారు తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి కార్పొరేషన్ రుణాలు, ప్రభుత్వం అందించే పథకాలు తెలుగుదేశం నాయకులకు మాత్రమే కేటాయించాలని అధికారులను ఆదేశించడం అన్యాయం అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పశువుల పెంపకం షెడ్లు నిర్మాణం కింద నిధులు మంజూరు చేయడం జరిగింది. వాటిని కూడా తెలుగుదేశం నాయకులు తూతూ మంత్రంగా షెడ్లు నిర్మాణాలు చేపట్టకుండా, పశువులు కూడా లేని వారికి పథకాలు అందించి నిధులు దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు ఎంపీపీ కి సంబంధం లేకుండా పలు అభివృద్ధి పనులు తెలుగుదేశం నాయకులు చేపట్టి ప్రభుత్వ నిధులు తప్పుదావ పట్టిస్తున్నారని పేర్కొన్నారు బుచ్చినాయుడు కండ్రిగ స్కూల్ సమీప నుంచి ఆర్ అండ్ బి పరిధిలోని రోడ్డు మార్గాలను కూడా ఎన్ ఆర్ జి ఎస్ నిధులతో చేపట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు.జడ్పిటిసి కి కేటాయించిన రూమును ఖాళీ చేయించాలని అనడం ఎవరికీ హక్కు లేదు
బుచ్చినాయుడు కండ్రిగ జడ్పిటిసి సభ్యులు ఆరణి ప్రతిమారెడ్డి పదవీకాలం ఇంకా ఉందని, ఆ రోజుల్లో మండల ఎంపీపీ, ఎంపీటీసీల సభ్యుల అనుమతితో జడ్పిటిసి రూమును కేటాయించడం జరిగిందని ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఉద్దేశపూర్వకంగా జడ్పిటిసి రూమును ఖాళీ చేయాలని ఎంపీడీవో కు ఆదేశించడం ఏమి హక్కు ఉందని. జడ్పిటిసి ప్రతిమారెడ్డి తమ్ముడు ఆరణి  విద్యనాథరెడ్డి , ఎంపీపీ ఎం సుబ్బలక్ష్మి పలువురు నాయకులు పేర్కొన్నారు.. గతంలో మహిళా కోటాలో జడ్పిటిసి గా ఎన్నుకోబడిన వారి స్థానంలో వారి భర్తలు పదవులు అనుభవించారు. గతంలోనూ ఇప్పటికీ మహిళ స్థానాల్లో ఎంపీటీసీలు, సర్పంచులు గెలుపొందిన వారు నేటికీ అన్ని సమావేశాల్లో వారి భర్తలు అనుచరులు మాత్రమే పాల్గొంటున్నారు.. నేడు తెలుగుదేశం నాయకులు ఉద్దేశపూర్వకంగా జెడ్పిటిసి రూమును ఖాళీ చేయాలంటూ అధికారులకు సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. జడ్పిటిసి తమ్ముడు మండల సర్పంచుల సంఘాల అధ్యక్షుడు ఆరని విద్యనాథరెడ్డి జడ్పిటిసి రూములో ఉండడం తప్పేంటని ఎంపీపీ మేకల సుబ్బలక్ష్మి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కె ఎం రాజా, బాల శేఖర్,కాటూరు ఎంపీటీసీ  రవి, భాస్కరయ్య , శంకరయ్య, భాస్కర్ రెడ్డి, బాలాజీ, గిరి రెడ్డి, రమేష్, పుట్టయ్య, తదితరులు పాల్గొన్నారు

 

Advertisement