ఫిబో ముయ్‌థాయ్ మీట్ లో కుప్పం వికాస్ డిగ్రీ కాలేజీ విద్యార్ధి అన్వేష్ అద్భుత ప్రదర్శన...
చిత్తూరు జిల్లా కుప్పం 2025 ఏప్రిల్ 10 నుండి 13 వరకు జర్మనీలోని కొలొన్ నగరంలో జరిగిన ఫిబో ముయ్‌థాయ్ మీట్ లో భారత్ తరుపున పాల్గొన్న వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్ధి అన్వేష్ రెండవ స్థానం లో నిలిచి భారతదేశానికి వెండి పథకం సాధించారు.
MTI అధ్యక్షుడు గ్రాండ్ మాస్టర్ MH అబిద్ మార్గదర్శకత్వం మరియు జాతీయ కోచ్ గ్రాండ్ మాస్టర్ N కుమార్ (MD AIM - AKFC) శిక్షణతో మరియు వికాస్ డిగ్రీ కళాశాల సహకారం మరియు తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధిచినట్టు అన్వేష్ తెలియజేసారు.
వెండి పథకం సాధించారు అన్వేష్ కు వికాస్ డిగ్రీ కళాశాల నందు వికాస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మంజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థి అన్వేష్ వెండి పథకాన్ని గెలుచుకోవడం మా కళాశాలకు గర్వకారంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.