ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై లారీ దగ్ధం

By Ravi
On
ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై లారీ దగ్ధం

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువుకట్ట దర్గా వద్ద లారీ దగ్ధమైంది. ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న లారీ ఓవర్ హీట్ అవ్వడంతో  ఒక్కసారిగా ఇంజన్ లో నుండి మంటలు చెలరేగాయి. డ్రైవర్ ముందు జాగ్రత్తగా దిగడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో స్పాట్ కి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అగ్నిప్రమాదం వల్ల లారీ పూర్తిగా కాలి బూడిదైంది. చెరువు కట్టపై ఇతర వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు.

Tags:

Advertisement