శ్రీలలిత త్రిపుర సుందరి దేవాలయంలో ప్రత్యేక పూజలు..!
హైదరాబాద్ TPN : తెలంగాణ ఎక్సైజ్‌భవన్ అవరణలో కొలువైన శ్రీలలిత త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్, ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి 15వ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి, మండప పూజ, చండీయాగంలో పాలుపంచుకున్నారు. ఉత్సవాల్లో చివరి రోజున కమిషనర్ హరికిరణ్, డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అశ్వీరాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్, డైరెక్టర్‌లకు పురోహితులు శాలువ కప్పి ఆశ్వీరాదాలు అందించారు. అనంతరం హోమగుండం చుట్టు ప్రదర్శనలు చేశారు. భోజన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు విజయలక్ష్మి, విజయ, కృష్ణ ప్రియ ఉత్సవ ఏర్పాట్లను, చండీయాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, డైరెక్టర్‌తోపాటు అడిషనల్, జాయింట్ కమిషనర్ ఖురేషి, జాయింట్ కమిషనర్లు సురేష్, కేఏబీ శాస్త్రీ, డిప్యూటి కమిషనర్ దశరథ్, రఘురామ్, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరిండెంట్లు, కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు.