చాహల్‌కు అదే చెప్పా: శ్రేయస్‌ 

By Ravi
On
చాహల్‌కు అదే చెప్పా: శ్రేయస్‌ 

తాజాగా ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తన సత్తా చాటుకుంది. కోల్ కతా టీమ్ లో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యార్ తన మాస్టర్ ప్లానింగ్ తో అదరగొట్టారు. తమ టీమ్‌ చేసిన 111 పరుగులను కాపాడుకుంటూ... 16 రన్స్‌ తేడాతో కోల్‌కతా పై విజయం సాధించారు. కాగా కోల్‌కతా టీమ్‌ 95 పరుగులకే ఔటయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ సేన 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. కోల్‌కతా బౌలర్లు హర్షిత్‌ రాణా 3, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ తలో రెండు వికెట్లు తీశారు. కోల్‌కతా విజయం ఇక లాంఛనమే అనుకున్నారు. సరిగ్గా అప్పుడే కోల్‌కతాకు చాహల్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. 

కేవలం 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. ఇది అతనికి ఐపీఎల్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ వికెట్స్. ఐపీఎల్‌లో అతి తక్కువ పరుగులు చేసి... విజయం సాధించిన టీమ్‌గా కూడా పంజాబ్‌ రికార్డు సాధించింది.  కోల్‌కతా బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో శ్రేయస్‌ అయ్యర్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. పిచ్‌ ప్రవర్తిస్తున్న తీరును పసిగట్టాడు. ఆ మేరకు చాహల్‌ కు ప్లానింగ్ ను సూచించాడు. నేను ఆ సమయంలో బాల్‌ కాస్త టర్న్‌ అవడాన్ని గమనించా. అప్పుడు నేను చాహల్‌ను శ్వాస మీద నియంత్రణ సాధించు, కాస్త కూల్‌గా ఉండు అని చెప్పా. కచ్చితత్వంతో బంతు లేసి, మనం బ్యాటర్లను అటాక్‌ చేయాలని సూచించా అని శ్రేయస్‌ అయ్యర్‌ మ్యాచ్‌ తర్వాత అన్నాడు.

Advertisement

Latest News

విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్? విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్?
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!