ఇంద్రకీలాద్రిలో పార్కింగ్ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!
By Ravi
On
శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రిలో.. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ కుటుంబానికి చెందిన కారులో నుంచి బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్ నుంచి అమలాపురం పెళ్లికి వెళ్లే దారిలో అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తురాలు పార్వతి కుటుంబం.. తమ కారును కొండకు వెళ్లే దారిలో ఉన్న టర్నింగ్‌లో పార్కింగ్ చేశారు. ఐతే.. ఆ కారులో నుంచి సుమారు 6.5 కాసుల గ్వంకీలు, 6 కాసుల హారం, 3 కాసుల నెక్లెస్, 2 కాసుల బుట్టలు, 1.5 గ్రాముల కమ్మలు, 1.2 గ్రాములు కమ్మలు, 3 తులాల నల్లపూసల గొలుసు, రెండు కాసుల చంప సవరాలు, 6 కాసుల పెద్ద గొలుసు దొంగతనానికి గురయ్యాయి. వన్ టౌన్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయగా.. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి.. సంఘటన స్థలాన్ని పరిశీలించింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: #ఇంద్రకీలాద్రి #శ్రీదుర్గామల్లేశ్వరదేవస్థానం #బంగారం_చోరీ #కారులో_నుంచి_దొంగతనం #విజయవాడ #అమ్మవారి_దర్శనం #వన్‌టౌన్_పోలీస్ #క్లూస్‌టీమ్ #భక్తులబంగారం #పార్వతికుటుంబం #హైదరాబాద్_నుంచి_అమలాపురం #దేవస్థానం_వద్ద_చోరీ #కారులో_పార్కింగ్ #తులాలబంగారం #నల్లపూసలగొలుసు #విజయవాడచోరీ #పోలీసుదర్యాప్తు #ఇంద్రకీలాద్రిలోచోరీ #దేవాలయాలదొంగతనాలు
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...