ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కు ఫైన్..
తాజాగా ఆడిన ఢిల్లీ టీమ్ కెప్టెన్ అక్షర్ పటేల్ కు బీసీసీఐ ఫైన్ విధించారు. ఐపీఎల్ లో ఆదివారం జరిగిన ముంబై మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా.. అతనికి 12 లక్షల ఫైన్ వేశారు. ఉత్కంఠంగా జరిగిన ఆ మ్యాచ్‌లో ముంబై 12 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. ఆ తర్వాత భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19 ఓవర్లలో 193 రన్స్ చేసి ఆలౌటైంది. కాగా ఈ మ్యాచ్ పై క్రికెట్ లవర్స్ తో పాటు బీసీసీఐలోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ క్రమంలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు ఫైన్ వేశామని, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కింద అతనికి జరిమానా విధించినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. టోర్నమెంట్‌లో తొలిసారి డీసీ ఓటమి పాలైంది. ఐపీఎల్‌లో అక్షర్ పటేల్ సరిగా పర్ఫార్మ్ చేయడం లేదు. అయిదు మ్యాచుల్లో అతను ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇక బ్యాటింగ్‌లో ఇప్పటి వరకు 67 రన్స్ మాత్రమే చేశారు. దీంతో ఆగ్రహించిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.