మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు: చిరంజీవి

By Ravi
On
మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు: చిరంజీవి

పవన్ కళ్యాణ్ చిన్నకొడుకు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. పవన్ కళ్యాణ్ ఒకపక్క మన్యం పర్యటనలో ఉండడంతో, ఆయన సింగపూర్ వెళ్లేందుకు ఆలస్యమైంది. ఈలోపు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లి, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. 

రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి, ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అని చిరంజీవి పోస్ట్ చేశారు.

Advertisement

Latest News

అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..! అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
హైదరాబాద్ TPN : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు సికింద్రాబాద్‌ ప్యారడైజ్ కూడలి...
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌..!
రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ..! రూ.562 కోట్ల పెట్టుబడులు..!
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్..!