రాజస్థాన్‌ కెప్టెన్ కు బీసీసీఐ భారీ జరిమానా?

By Ravi
On
రాజస్థాన్‌ కెప్టెన్ కు బీసీసీఐ భారీ జరిమానా?

గుజరాత్‌ లో లేటెస్ట్ మ్యాచ్‌ లో 58 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఆ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్ కు బీసీసీఐ ఫైన్ వేసింది. ఐపీఎల్‌ 2025లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా గుజ‌రాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్  కారణంగా రాజస్థాన్ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఏకంగా రూ.24 ల‌క్ష‌ల ఫైన్ వేసింది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం, ఇది జట్టు యొక్క రెండో ఓవర్ రేట్ నేరం కావడంతో సంజూ శాంసన్‌పై ఈ భారీ జరిమానా విధించారు. 

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 216 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్‌ ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ ఫోకస్ తప్పింది. వరుస వికెట్లు కోల్పోవడంతో 159 పరుగులకే ఆలౌటైంది. టీమ్ ఓటమిపై కెప్టెన్ శాంసన్ స్పందించారు. గుజ‌రాత్ తో స్టార్టింగ్ లోనే త‌మ బౌల‌ర్లు ప్ర‌ణాళిక‌లకు త‌గిన‌ట్లుగా బౌలింగ్ చేశార‌ని సంజూ అన్నారు. అలాగే బ్యాటింగ్ లో పీక్స్ స్టేజ్ లో తాము వికెట్లు కోల్పోవ‌డం కూడా మ్యాచ్‌ ఓటమి ఓ కారణం అని సంజూ అన్నాడు.

Advertisement

Latest News

ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..? ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. వాటిల్లో సెన్సేషనల్ మాస్...
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!