యశస్వి జైస్వాల్ పై మాజీ క్రికెటర్ కామెంట్స్..
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రజంట్ ఫామ్ లో లేరనే సంగతి తెలిసిందే. ప్రజంట్ ఆయన పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ 2025 లో ఫెయిల్ అయిన అతను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి సెలెక్ట్ చేసిన ఇండియా టీమ్ లో ప్లేస్ కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకేసారి హాఫ్ సెంచరీ బాదాడు. ఈ క్రమంలో జైస్వాల్ కు పృథ్వీ షాను ఎగ్జాంపుల్ గా చూపుతూ.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఓ వార్నింగ్ చేశాడు. యశస్వి జైస్వాల్ క్రికెట్ మీద ఫోకస్ చేయడం లేదు. ఇలానే కొనసాగితే బాధపడాల్సి వస్తుంది. పృథ్వీ షానే దీనికి మంచి ఉదాహరణ. పరిస్థితి చేయి దాటకముందే క్రికెట్‌ను ప్రేమించు, తిరిగి ఫామ్ అందుకో అని వార్నింగ్ చేశారు.
ఐపీఎల్, దేశవాళీల్లో సత్తాచాటిన పృథ్వీ షా.. ఎంత వేగంగా వచ్చాడో.. అంతే తొందరగా టీమ్ లో స్థానం కోల్పోయాడు. కేవలం భారత జట్టులో మాత్రమే కాదు.. ఐపీఎల్‌లో కూడా ఆడట్లేదు. గత వేలంలో అతన్ని ఏ జట్టూ కొనలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 రిటైర్‌మెంట్ గురించి బాసిత్ అలీ స్పందించాడు. టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలిచిన తర్వాత కోహ్లీ, రోహిత్‌లు ఈ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇది చాలా మంచి నిర్ణయం. భారత్‌లో టాలెంట్ ఉన్న యువ క్రీడాకారులు ఎందరో ఉన్నారు. వారు ఈ ఇద్దరినీ భర్తీ చేస్తారు. అయితే కోహ్లీ అంత తొందరగా టీ20ల నుంచి రిటైర్ అవుతాడని నేను అనుకోలేదు అని బాసిత్ అలీ పేర్కొన్నాడు.