పాకిస్తాన్తో కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయి : కంగనా రనౌత్
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ బ్రిటిష్ వలసవాద వారసత్వం, గతంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు ఆ పార్టీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ కు పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఆశాంతి, భయానక వాతావరణం ఉండేదని కామెంట్ చేశారు. ఇక, అటల్ జీ చాలా కష్టంతో ప్రభుత్వాన్ని నడిపించారు. అటల్ జీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సమయంలో ఈ కాంగ్రెస్ కు చెందిన వారు పార్లమెంటుపై దాడికి కుట్ర చేశారని కంగనా రనౌత్ పేర్కొంది.
కాగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కౌంటర్స్ వేశారు. మహిళలకు నెలకు రూ. 8,000 ఇస్తామన్నారు. ఏడాదికి 50 వేల రూపాయలు ఇస్తామని అబద్ధాపు హామీలు ఇచ్చారని అన్నారు. అలాగే వక్ఫ్ సవరణ బిల్లు ప్రయోజనాలను పార్లమెంట్ లో అమిత్ షా వివరిస్తున్నప్పుడు.. ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు గొడవ చేసి, సభలో తీవ్ర అంతరాయం సృష్టించారని అన్నారు. కాగా, చట్టంలోని రూల్స్ ప్రకారం.. అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు వక్ఫ్ ఆస్తుల రికార్డులను డిజిటలైజ్ చేసి, వాటిని కేంద్రీకృత పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.