జాక్ మూవీ రివ్యూ ఎలా ఉందంటే..?
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేసిన జాక్ మూవీ నేడు రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. కథ సినిమాకు బలంగా నిలుస్తుంది. అదే జాక్ మూవీకి ప్లస్ అయ్యింది. ఫస్ట్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు మంచి రోల్ ను అందించారు. టిల్లు లాంటి రోల్ తర్వాత జాక్ మరో సాలిడ్ ఛాయిస్ అని చెప్పొచ్చు. జాక్ గా సిద్ధు నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన మార్క్ యాటిట్యూడ్ అండ్ కామెడీ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేశారు. ఇక హీరోయిన్ గా వైష్ణవి తన రోల్ ని పర్ఫెక్ట్ గా వర్కవుట్ చేసింది. స్పెషల్లీ సిద్ధుకి, వైష్ణవికి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ చాలా బాగా హైలెట్ అయ్యాయి. అయితే సెకండాఫ్ మాత్రం కొంచెం రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లానే ఉంది.
క్లైమాక్స్ కి వచ్చేసరికి స్క్రీన్ ప్లే కూడా కాస్త డల్ అయిన ఫీలింగ్ కలిగింది. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి. కథకి తగ్గట్లుగా కొన్ని రియల్ లోకేషన్స్ కి వెళ్లారు. బట్ విజువల్ ఎఫెక్ట్స్ లో మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ విషయానికి వస్తే.. డైరెక్టర్ గా ఒక సినిమాతో సంబంధం లేకుండా తీసిన కొత్త సబ్జెక్ట్ గా అందించే ప్రయత్నం బాగుంది. కొంచెం లేట్ అయినా కూడా డైరెక్టర్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. యాక్షన్, సస్పెన్స్ తో పాటు కామెడీ టైమింగ్స్ ఉన్న సీన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మొత్తానికి జాక్ మూవీ డీసెంట్ ఎంటర్ టైనింగ్ గా కనిపిస్తుంది.