రానా నాయుడు సీజ‌న్ 2 అప్డేట్‌

By Ravi
On
రానా నాయుడు సీజ‌న్ 2 అప్డేట్‌

వెంకటేష్, రానా కాంబినేషన్ లో వచ్చిన రానానాయుడు వెబ్ సిరీస్ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. 2023 మార్చిలో రిలీజ్ కాగా బోల్డ్ టాపిక్స్ తో ఈ సిరీస్‌ ను ప్లాన్ చేసిన తీరుపై చాలా విమ‌ర్శలు వ‌చ్చాయి. ఫ్యామిలీ హీరోగా వెంక‌టేష్‌ కు ఉన్న ఇమేజ్‌ ను ఈ సిరీస్ కొంత డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజ‌న్‌లో బోల్డ్‌ నెస్ బాగా త‌గ్గించిన‌ట్లు స‌మాచారం. ఇక రానా నాయుడు సీజ‌న్ 2కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా రోజుల క్రిత‌మే కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ వైరల్ అవుతోంది. డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నల‌గ‌డ్డ నటించిన జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు రానా ద‌గ్గుబాటి స్పెషల్ గెస్ట్ గా హాజ‌రు కాబోతున్నట్లు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. 

అయితే రానా ద‌గ్గుబాటి రాకపోవడం పై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నల‌గ‌డ్డ క్లారిటీ ఇచ్చాడు. రానా ముంబాయిలో రానా నాయుడు వెబ్‌సిరీస్‌కు డ‌బ్బింగ్ పనిలో ఉన్నాడు అని అన్నారు. ఇక వెంక‌టేష్‌తో పాటు రానా త‌మ పాత్రల‌కు డ‌బ్బింగ్ చెబుతోన్నట్లు తెలిసింది. అంతే కాదు  మే నెల‌లోగా ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మొత్తం కంప్లీట్ చేసి, జూన్‌లో ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్నారట.

Advertisement

Latest News

ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..? ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. వాటిల్లో సెన్సేషనల్ మాస్...
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!