అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు..!
By Ravi
On
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో పవన్ చిన్న కొడుకు చేతులు, కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. అక్కడి స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించడంతో.. ఆ మంటల్లో చిక్కుకున్నాడు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. మన్యంలో పర్యటన ముగిసిన వెంటనే పవన్ సింగపూర్ వెళ్లనున్నారు.
Tags:
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...