17వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన ఎస్ఎన్ఎల్ఎస్ కాలనీ నర్సింహస్వామి దేవాలయం
By Ravi
On
బాలాపూర్:
బాలాపూర్ చౌరస్తాలోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం 17వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈనెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు దిండు భూపేష్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఒక కరపత్రం విడుదల చేశారు, ఇందులో ఉత్సవాల వివరాలను వెల్లడించారు. 23వ తేదీన నరసింహ స్వామి తిరుకల్యాణోత్సవం ప్రత్యేకంగా జరగనున్నట్లు వారు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి వారి కృపను పొందాలని ఆలయ కమిటీ ఆహ్వానించింది.
భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని నిర్వాహకులు కోరారు.
Tags:
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...