నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
By Ravi
On
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిసింది. నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రత సిబ్బంది గాలింపు చేపట్టారు. అక్కడ మావోయిస్టులను గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కూంబింగ్ చేపడుతున్న భద్రత బలగాలపై మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు దిగటంతో.. ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. అయితే ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు సాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందరరాజ్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...