మీర్‌పేట్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..!
By Ravi
On
సమ సమాజ స్థాపనకు నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బీర్ అంబేద్కర్ అని కొనియాడారు బీజేపీ నేత పసునూరి బిక్షపతి చారి. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో బిక్షపతిచారి ఆధ్వర్యంలో జిల్లెలగూడ, మీర్‌పేట్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర బీజేపీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల జీవితాలు కేవలం చదువుతో మాత్రమే బాగుపడతాయని చెప్పిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అంటే కేవలం అంబేద్కర్ పుణ్యమే అని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయాలను నిరంతరం కొనసాగించాలని.. ఆయన అడుగుజాడల్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...