ఒరిస్సా పూరీ ఆలయంలో హఠాత్ పరిణామం..

By Ravi
On
ఒరిస్సా పూరీ ఆలయంలో హఠాత్ పరిణామం..

ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా చూస్తారు. కాగా ఈ ఆలయం శిఖరంపై ఉన్న నీలచక్రంపై ఎగిరే జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గోపురంపై ఉన్న జెండాను గద్ద తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సముద్రంవైపు వెళ్లిపోయింది. ఇది చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా ఆ వీడియో వైరల్‌ అవుతోంది. 

కాగా ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోవడం గమనార్హం. కాగా, పూరీకి వచ్చే భక్తులంతా మొదటగా ఈ జెండా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఆలయంలో జగన్నాథుడి దర్శనం కోసం వెళ్తారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు. కాగా పూరీలోని ఈ జెండాకు సైతం విశిష్టత కలిగి ఉంది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!