సినిమా కంటెంట్ పై తమన్నా కామెంట్స్..

తమన్నా సినీ ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాలు చేసి నంబర్ స్టార్ హీరోయిన్ గా ఫామ్ లో ఇప్పటికీ దూసుకుపోతుంది. తమన్నా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోయిన్ గా ముందుకు సాగుతుంది. ఇక రీసెంట్ టైమ్ లో బాలీవుడ్ లోనూ ఈ హీరోయిన్ పేరు మార్మోగింది. ఇక చాలా రోజుల తర్వాత తమన్నా లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓదెల 2 తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు అశోక్ తేజ్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా నాగ సాధువుగా కనిపిస్తున్నారు. ఇక హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ ట్రైలర్ తో అంచనాలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన ఈ సినిమా ఏప్రిల్ 17 న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు తమన్నా. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. తమన్నాకి ఆఫర్లు లేకపోవడంతో చిన్న సినిమాల్లో నటిస్తున్నారా? అనే ప్రశ్నకు తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు అనే మాట చాలా వ్రాంగ్ ఎందుకంటే.. నా దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. కంటెంట్ బాగుంటే అది పెద్ద సినిమా అవుతుంది. బాగోకపోతే పెద్ద సినిమా కూడా చిన్న సినిమా అవుతుంది. కెరీర్ ప్రారంభంలో నేను నటించిన హ్యాపీడేస్ మూవీలో ఎనిమిది మెయిన్ లీడ్స్ లో నేనొకదాన్ని. నాకు డ్యాన్స్ ఇష్టం కాబట్టి బాలీవుడ్ మూవీ స్త్రీ 2లో స్పెషల్ సాంగ్‌లో యాక్ట్ చేశానని అన్నారు.
Latest News
