అమెరికా కన్నా బెటర్ రోడ్లు మనవయ్యేలా చేస్తా: నితిన్‌ గడ్కరీ

By Ravi
On
అమెరికా కన్నా బెటర్ రోడ్లు మనవయ్యేలా చేస్తా: నితిన్‌ గడ్కరీ

మన దేశంలో హైవేలను అమెరికా రోడ్ల కంటే అందంగా తీర్చిదిద్దుతానని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అమెరికా రిచ్ కంట్రీ కాబట్టి అక్కడ రోడ్లు బావుండటంలో పెద్ద విశేషం లేదు. అక్కడి రోడ్లు బావుండటం వల్ల అది రిచ్ కంట్రీ అయ్యిందని జాన్ఎఫ్ కెన్నడీ అన్నట్లుగా నితిన్ గడ్కరీ చెప్పారు. రానున్న రెండేళ్ల కాలంలో భారత్ లో అన్నీ హైవేలు అమెరికా కన్నా అద్భుతంగా ఉంటాయని అన్నారు. కేవలం మాటలు మాత్రమే కాదని, వాటిని నెరవేర్చుతానని అన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారుల బాధ్యతను తనకు అప్పగించారని ఆయన అన్నారు. 

గత 11 ఏళ్లలో భారత్ వ్యాప్తంగా అనేక రోడ్లు, ఫ్లైఓవర్లు వంతెనలు సక్సెస్ ఫుల్ గా నిర్మించామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో భారతదేశ రోడ్లపై గుంతలే ఎక్కువగా ఉంటాయని విదేశీయులు పలు కామెంట్స్ చేసేవారని మంత్రి అన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రహదారులను అందంగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో.. రోడ్డు కనెక్టివిటీ పరంగా భారత్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మారుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ ఉన్నచోట పరిశ్రమలు, వ్యాపారాలు పెరుగుతాయని అన్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!