ఇక్కడ నేనే తోపు : కేఎల్ రాహుల్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తనకు హోమ్ గ్రౌండ్ అని, ఈ మైదానం పరిస్థితుల గురించి తనకంటే బాగా ఇంకా ఇంకెవరికి తెలుసు అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా అని అన్నారు. స్టేడియం చిన్నదే అయినా.. పిచ్ మాత్రం సవాల్ విసురుతుంది అని చెప్పుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ తన క్యాచ్‌ను వదిలేయడం కలిసొచ్చిందని రాహుల్ తెలిపాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో డీసీ గెలిచింది.
బెంగళూరు నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 93 పరుగులు చేసి బెంగళూరును కమాండ్ చేశారు. అయితే 5 పరుగుల వద్ద రాహుల్ క్యాచ్‌ను రజత్ పాటీదార్ వదిలేయడంతో ఆర్సీబీ మ్యాచ్ ఫెయిల్ అయ్యింది.ఇక తన టీమ్ కు అద్భుత విజయాన్ని అందించిన రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.