ఇంట్రో సీన్స్ తో స్టార్ట్ చేయనున్న ఎన్టీఆర్ !

By Ravi
On
ఇంట్రో సీన్స్ తో స్టార్ట్ చేయనున్న ఎన్టీఆర్ !

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో రానున్న సినిమాపై రోజుకొక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఈ సినిమా షూట్ ఈ నెల 22 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఐతే, తాజాగా ఈ షెడ్యూల్ గురించి వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారని టాక్. ఇక ఈ మూవీ టైటిల్ డ్రాగన్‌ అని టాక్. ఐతే, డ్రాగన్‌ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నారట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. సో ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. 

ఇక ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ మూవీని తీస్తున్నాను. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని తెలిపారు. మొత్తానికి భారీ బడ్జెట్ తో వస్తున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా గురించి డైలీ ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Latest News

అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..! అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
హైదరాబాద్ TPN : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు సికింద్రాబాద్‌ ప్యారడైజ్ కూడలి...
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌..!
రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ..! రూ.562 కోట్ల పెట్టుబడులు..!
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్..!