60 వేల మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ - 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

By Ravi
On
60 వేల మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ - 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

  • 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 60 వేల మంది కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్.

  • ఎన్టీఆర్ దివ్య ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం తో ప్రజలకు సేవ.

  • టీడీపీ 43 సంవత్సరాల చరిత్రలో ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొంది.

  • పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ యోగాలు, జాతీయ స్థాయిలో కీలక పాత్ర.

  • PE4 కార్యక్రమం, సభ్యత్వం ద్వారా కార్యకర్తల సంక్షేమం.

జై తెలుగుదేశం...జోహార్ ఎన్టీఆర్!

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు మరియు నాయకులకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 60 వేల మంది కార్యకర్తలు, నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ:

  • "తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజానికానికి మరియు అభిమానులకు నా ధన్యవాదాలు."

  • "తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అనేది అన్ని వర్గాల పండుగ. ప్రతి వర్గం ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే వారి ఆశలను నెరవేర్చింది."

  • "తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. నాలుగు దశాబ్దాలుగా పార్టీతో నడుస్తున్న నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా."

  • "మన పార్టీ తన సిద్ధాంతాలతో మాత్రమే ముందుకు సాగుతుంది. పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగుజాతిని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం."

  • "తెలుగుదేశం పార్టీ ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించింది. ఎన్టీఆర్ గారి ఆత్మగౌరవ నినాదంతో మనం ముందుకు సాగుతున్నాం. నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాను."

  • "తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అనేది స్ఫూర్తి. ఇది ప్రజలకు హక్కులు, అవకాశాలు, సంక్షేమం ఇచ్చింది."

  • "పార్టీ పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించడంతో మహిళలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తి హక్కులు కల్పించింది."

  • "తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండి, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించింది. ఇది మన తెలుగుజాతికి గర్వకారణం."

  • "2019 తర్వాత జరిగిన దాడులు, అక్రమ కేసులు, బెదిరింపులు, అరెస్టులు... అమైనా కార్యకర్తలు ‘జై తెలుగుదేశం’ నినాదంతో మితిమీరిన పోరాటం జరిపారు."

  • "పార్టీ 43 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లను ధీటుగా ఎదుర్కొని నిలబడింది. కార్యకర్తల త్యాగాలు, పోరాటమే దీనికి కారణం."

  • "మనం ఈ సారి మహానాడు కడపలో నిర్వహించబోతున్నాం. పేదలకు అండగా నిలవాలని ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పేవారు."

  • "పీ4 కార్యక్రమం ద్వారా ఆర్థికంగా బాగున్నవారు అట్టడుగున ఉన్నవారికి సహకారం అందించి, వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే లక్ష్యంతో ప్రారంభిస్తున్నాం."

  • "కోటి సభ్యత్వాలు అనేది అసాధారణ రికార్డ్. రూపాయి 5 లక్షల ప్రమాద బీమా ద్వారా కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం."

  • "కార్యకర్తలు నాన్నగా, పార్టీ కుటుంబ పెద్దగా నేను ఎప్పటికప్పుడు అండగా ఉంటా. తెలుగుదేశం బలోపేతం అవ్వడం అంటే రాష్ట్రానికి మంచిది."

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!