గిరిజనుల సంస్కృతీ వారసత్వాల‌కు వేదిక‌గా ట్రైబ‌ల్ మ్యూజియం

By Ravi
On
గిరిజనుల సంస్కృతీ వారసత్వాల‌కు వేదిక‌గా ట్రైబ‌ల్ మ్యూజియం

హైద‌రాబాద్: భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో గిరిజనుల గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మరింత అవకాశం ఏర్పడిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.

మంగ‌ళ‌వారం నాడు శాస‌న‌స‌భ ఆవ‌ర‌ణలో భద్రాచలం ట్రైబ‌ల్ మ్యూజియం యొక్క బ్రోచ‌ర్ ను మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీత‌క్క గారు విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, "ఈ మ్యూజియం గిరిజన సంప్రదాయాలను, వేషభాషల, జీవన విధానాన్ని, హస్తకళలను, ప్రజా గీతాలను, ఆచార వ్యవహారాలను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుంద"న్నారు.

భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకల సంద‌ర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మ్యూజియంను ప్రారంభిస్తామని మంత్రి వెల్ల‌డించారు.

భద్రాచలం రామాలయం ఒక పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో భద్రాచలం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇది స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మంత్రి తెలిపారు.

గిరిజన సంస్కృతి పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, "గిరిజనుల జీవన విధానం, వారి సంప్రదాయాలు క్రమంగా మాయమవుతున్నాయి. మన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి మ్యూజియం ఎంతో అవసరం" అని మంత్రి చెప్పారు.

గిరిజన కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు, వారి చేతిపనులకు విస్తృత మార్కెట్‌ను అందించేందుకు ఈ మ్యూజియం దోహదపడుతుంది. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇది ఒక కీలకమైన అడుగు అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

రైట‌ప్: భ‌ద్రాచలం ట్రైబ‌ల్ మ్యూజియం బ్రోచ‌ర్‌ను మంగ‌ళ‌వారం నాడు శాస‌న‌స‌భ ఆవ‌ర‌ణలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీత‌క్క గారు విడుదల చేశారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!