వక్ఫ్ సవరణ చట్టం.. సుప్రీం కీలక ఆదేశాలు

By Ravi
On
వక్ఫ్ సవరణ చట్టం.. సుప్రీం కీలక ఆదేశాలు

పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. అయితే వక్ప్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని సీజెఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తరపున ఎస్ జి తుషార్ మెహతా వాదించారు. ఆ క్రమంలో కొన్ని సెక్షన్లను మాత్రమే చదివి నిర్ణయం తీసుకోవద్దని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఈ విషయంలో అనేక సవరణలు,కమిటీల ఏర్పాట్లు,లక్షల సంఖ్యలో అభ్యర్థనలు ఉన్నాయని గుర్తు చేశారు. 

వక్ప్ ఆస్తులుగానూ, వ్యక్తిగత ఆస్తులను తీసుకున్నారని, ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. డైరెక్ట్ గా గానీ, ఇన్ డైరెక్ట్ గా గానీ స్టే ఇవ్వడం కఠినమైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దయచేసి తనకు ఒక వారం సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అలాగే తన వాదనలతో పాటు డాక్యుమెంట్లను సమర్పించడానికి సైతం అనుమతించాలని విజ్జప్తి చేశారు. ఆ వెంటనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. మేము పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదన్నారు. ఐదేళ్ల వరకు ప్రొవిజెన్స్ ఉన్నాయని తమకు తెలుసునని స్పష్టం చేయగా.. వాటిని తాము స్టే చేయడం లేదని స్పష్టం చేశారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!