పంజాబ్ టీమ్ కు భారీ షాక్
ప్రజంట్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ టీమ్ తన సత్తా చాటుకుంటుంది. అయితే ఈ టీమ్ కు భారీ షాక్ తగిలింది. న్యూజీలాండ్ క్రికెటర్ లాకీ ఫెర్గూసన్ కు తగిలిన గాయం కారణంగా ఆయన ఐపీఎల్ 2025 నుండి తప్పుకున్నారు. కాగా శనివారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ క్రికెటర్ గాయపడ్డారు. దీంతో మ్యాచ్ లో రెండు బాల్స్ మాత్రమే బౌలింగ్ చేశారు. ఆ తర్వాత ఫిజియోతో పాటుగా ఫెర్గూసన్ గ్రౌండ్ ను విడిచి పెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ రోజున ఫెర్గూసన్ లేని లోటు మ్యాచ్ పై ఎఫెక్ట్ చూపించింది.
కివీస్ యంగ్ ఫాస్ట్ బౌలర్ జేవియర్ బార్ట్ లెట్ ఫెర్గూసన్ స్థానంలో ఆడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా అఫ్గాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను కూడా జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. భారత యువ ఫాస్ట్ బౌలర్ విజయ్ కుమార్ వైశాక్ కూడా ఫెర్గూసన్‌కు ప్రత్యామ్యాయంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 జీటీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ సీజన్లో రాణించిన ఫెర్గూసన్ జట్టుకు దూరమవడం పంజాబ్ కింగ్స్‌కు పెద్ద లోటే అని చెప్పాలి.