సూర్య రెట్రో ట్రైలర్ డేట్ ఫిక్స్..
కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో సూర్య యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్స్ లో రెట్రో ఒకటి. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ పీరియాడిక్ నేపథ్యంలో వస్తుంది. గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్దే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ తో పాటు 2 డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో జ్యోతిక, సూర్య కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మే 1 న తెలుగుతో పాటు తమిళ భాషలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ టీజర్, సాంగ్స్, గ్లింప్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తుంది.
ముఖ్యంగా సూర్య, పూజా హెగ్డే కాంబినేషన్ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కాగా ఈ మూవీకి సంబంధించిన అవైటెడ్ ట్రైలర్ ఏప్రిల్ 18న రిలీజ్ అంటు సూర్య ఇంకా పూజ పోస్టర్ తో పోస్ట్ పెట్టారు. అంతే కాదు ట్రైలర్‌తో పాటుగా ఆడియో లాంచ్ కూడా చేస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. తమిళ నాట గ్రాండ్‌గా ఆడియెన్స్ ఫంక్షన్ చేస్తుండగా అదే రోజున సాయంత్రం ట్రైలర్ రానుంది. మరిక ఏ టైం కి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.