మ్యాచ్ విన్ అవ్వాలని ఆంజనేయున్ని దర్శించుకున్న ప్రీతి జింటా
దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరం అంతటా హనుమాన్ జయంతి వేడుకల సందడి నెలకొంది. హనుమాన్ జయంతి వేళ పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ప్రీతి జింటా ప్రత్యేకంగా అక్షింతలు తీసుకొని వెళ్లింది. నేడు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది.
ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ విజయాన్ని కాంక్షిస్తూ.. కొండంత బలమివ్వు స్వామి అంటూ వీరాంజనేయ స్వామిని దర్శించుకుంది ప్రీతి జింట. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఆశించినంతగా రాణించడం లేదు. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో, ఒకే ఒక్క విజయం సాధించి నాలుగు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. నేడు జరుగబోయే మ్యాచ్ లో విక్టరీ కొట్టాలని సంకల్పం పెట్టుకుంది.