ట్రంప్, మస్క్ మధ్య కోల్డ్ వార్?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, టెస్లా ఫౌండర్ మస్క్ కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. వీరికి 2024 అమెరికా ఎన్నికల సమయం నుండి సత్సంబంధాలు క్రియేట్ అయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చాక.. మస్క్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇదే రివర్స్ అయింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మస్క్ తీరును తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా ఒక ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ వ్యవహారం మరింతగా ముదిరింది.
ఇక లేటెస్ట్ గా ప్రపంచ దేశాలపై ట్రంప్ టారీఫ్ లపై ట్రంప్ తీరును మస్క్ క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇదే కంటిన్యూ అయితే వీరి మధ్య భవిష్యత్ లో ఎలాంటి సంబంధాలు ఉండవు. రీసెంట్ గా అన్ని దేశాలపై ట్రంప్ టారీఫ్ లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అత్యధికంగా చైనాపై సుంకాలు చెల్లించారు. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రంప్‌ను మస్క్ కోరారు. కానీ అందుకు ట్రంప్ అంగీకరించలేదు. దీంతో ట్రంప్ వాణిజ్య సలహాదారుడి తీరును మస్క్ తప్పుపట్టారు. అందుకే వీరిమధ్య సంబంధాలు చెడిపోయినట్లు తెలుస్తుంది.