సొంతంగా ఎదిగేందుకు హరీష్‌రావు ప్లాన్‌..!

By Ravi
On
సొంతంగా ఎదిగేందుకు హరీష్‌రావు ప్లాన్‌..!

  • మాస్టర్‌ప్లాన్‌లో బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు 
  • సొంత గోడలు నిర్మించుకుంటున్న ట్రబుల్‌ షూటర్‌
  •  ద్వితీయ శ్రేణి నేతలతో కూడా మంచి సంబంధాలు 
  • హరీష్‌రావు ఎదుగుదలకు కేసీఆర్‌ అడ్డుకట్ట
  •  కేటీఆర్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇచ్చి వారసుడిగా ప్రకటన 
  • వచ్చే ఎన్నికల కోసం పాదయాత్ర ప్లానింగ్‌లో కేటీఆర్‌
  •  వార్షికోత్సవ సన్నాహక సమావేశాల్లో కనిపించని హరీష్‌రావు

హరీష్‌రావు స్వయంగా ఎదిగేందుకు ప్లాన్ చేస్తున్నారా..? కేసీఆర్‌ను ఆయన అస్సలు పట్టించుకోవడంలేదా..? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూస్తుంటే.. అలానే అనిపిస్తోంది. బీఆర్ఎస్ కేడర్‌పై కేసీఆర్ కంటే కూడా హరీష్‌రావుకే ఎక్కువ పట్టుంది. అందుకే ఆయన ఈసారి సొంతంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆయన కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆందోళనలను కూడా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. ఆయన ఒక తమిళ గ్రూపునకు చెందిన టీవీ ఛానల్‌లో పెట్టుబడి పెట్టారు. కేసీఆర్ హెచ్చరిక అందిన తర్వాత అదే ఛానల్ నుంచి ఆయన పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారని చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం హెచ్చరిక వచ్చినా.. రాకపోయినా.. ఆయన పట్టించుకోనట్లు కనిపిస్తోంది. స్పష్టంగా ఆయన తన కెరీర్ కోసం తన సొంత గోడలు నిర్మించుకుంటున్నారు. 

వాస్తవానికి.. హరీష్‌రావు మొదటి నుంచి కేసీఆర్‌తో ప్రయాణిస్తున్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలోని గ్రౌండ్ లెవల్ కేడర్ కూడా హరీష్‌రావుకు తెలుసు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో మంత్రులుగా పనిచేసిన వారిలో చాలామందికి హరీష్‌రావుతో మాత్రమే సంబంధాలు ఉన్నాయి. అంత బలం ఉన్న నాయకుడిని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని గులాబీ క్యాడర్‌లోనే గుసగుసలు వినిపిస్తుంటాయి. చాలా నాటకీయంగా హరీష్ రావును పక్కన పెట్టారనే టాక్‌ ఉంది. అయితే కేటీఆర్, కవిత, సంతోష్‌ల కెరీర్‌ కోసం హరీష్‌రావును బలిపశువు చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో ఎప్పుడో వైఎస్ఆర్‌తో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్న అంశాన్నే సాకును చూపించి.. హరీష్‌రావును అధికారం నుంచి దూరం చేశారని ఆయన అనచరులు ఆరోపిస్తుంటారు. 

మరోవైపు తెలంగాణ ఉద్యమం మధ్యలో వచ్చిన కేటీఆర్‌కు కేసీఆర్‌ అధికారంలో పెద్ద పీట వేశారు. ఆయన్నే తన రాజకీయ వారసుడిగా  కేసీఆర్ పరోక్షంగా ప్రకటించారు. అందుకే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ కట్టబెట్టి ఇన్‌డైరెక్టుగా హింట్‌ ఇచ్చారు. 2028 లేదా 2029లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే.. కచ్చితంగా కేటీఆర్‌ సీఎం అవుతారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆయన కూడా దీని కోసమే పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్‌.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారు. ఈ విషయాన్ని గమనించిన హరీష్‌రావు తన కెరీర్‌ను బలంగా నిర్మించుకోవడం ప్రారంభించారు. రేవంత్‌రెడ్డిని ధీటుగా ఎదుర్కొంటూ, అసెంబ్లీతోపాటు బయట కూడా ఎక్కువగా మాట్లాడిందే హరీష్‌రావే. రైతు రుణమాఫీ వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డిని సవాలు చేసిన వ్యక్తి ఆయనే. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని చాలా వేగంగా ముందుకు సాగుతున్నారు. అటు కేటీఆర్ పాదయాత్ర గురించి ప్రకటించారే తప్ప.. ఇంతవరకు దాని గురించి వివరాలేమీ వెల్లడించలేదు. వచ్చే ఎన్నికల్లో తాను బలపడటానికి మార్గం సుగమం చేసుకోవడానికే పాదయాత్ర ప్లాన్‌ అని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే.. పార్టీ పాతికేళ్ల వార్షికోత్సవానికి కేసీఆర్ సన్నాహక సమావేశాల్లో హరీష్‌రావు ఎక్కడా కనిపించడం లేదు. కానీ.. హరీష్‌రావు పూనుకుంటేనే క్యాడర్‌ను సభకు తీసుకురాగలరు. ఆ విషయం అటు కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌కు కూడా బాగా తెలుసు. మరి గులాబీ అధినేత హరీష్‌రావు ఎత్తుగడలకు అడ్డుకట్ట వేస్తారా..? కేటీఆర్‌కు లైన్‌ క్లియర్‌ చేస్తారా..? అన్నది వేచి చూడాలి.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!