Author: Sai Durga

ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వెలువడిన విడాకుల నిర్ణయం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇకపై తాము మంచి స్నేహితులుగా, పిల్లలకు బాధ్యతాయుతమైన పేరెంట్స్‌గా మాత్రమే కొనసాగుతామని క్లియర్‌గా చెబుతూ, తమ వ్యక్తిగత గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో కొంతమంది చేసే విపరీతమైన చర్చలు, ట్రోల్స్‌ను గమనించిన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు వెంటనే అప్రమత్తమయ్యాయి. రాజకీయంగా ఎలాంటి స్నేహం ఉన్నా, విభేదాలు ఉన్నా కూడా ఏ నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని వివాదాలకు వేదికగా మార్చకూడనే ఉద్దేశంతో టీడీపీ, వైసీపీలు తమ సోషల్ మీడియా…

Read More

ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో దశాబ్దాలుగా ఎప్పటికీ వీడని కొన్ని రహస్యాలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా 2004 సంవత్సరంలో యూపీఏ కూటమి ఊహించని విజయాన్ని సాధించిన తర్వాత, దేశ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ముందు ఉన్నా కూడా.. ఆమె ఎందుకు ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారనే దానిపై ఎమోషనల్ నిజాలను బయటపెట్టారు. ఎన్నికలకు ముందుగానే తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకాతో ప్రధాని పదవి విషయంపై చర్చించానని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దారుణ హత్యలను కళ్లారా చూసిన ఆ పిల్లలకు ప్రధాని పదవి అంటే ప్రాణాలకు ముప్పు అని అన్పించేంత భయం ఉండేదని సోనియా గాంధీ(Sonia Gandhi) గుర్తు చేసుకున్నారు. పార్టీ యూనిటీని కాపాడుకోవాలని,అలాగే లీడర్‌షిప్ కోసం ఎలాంటి పోరు రాకూడదని భావించానని తెలిపారు. గత…

Read More

రాజకీయాల్లో ఎప్పుడూ దూసుకెళ్తూ, అటు సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉండే జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వ్యక్తిగత జీవితంలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన సతీమణి అన్నా కొణిదెలతో డైవోర్స్ తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన పవన్.. అందరికీ గట్టి షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అన్నా లెజినోవా ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. జీవితంలో ఎంతోకాలం కలిసి ప్రయాణించినా కూడా, పరస్పర అంగీకారం, మెచ్యూరిటీతోనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నామని వారు ఆ నోట్‌లో స్పష్టం చేశారు. మా దారులు వేరైనా సరే, విడిపోయినా మంచి ఫ్రెండ్స్‌గానే కొనసాగుతామని, పిల్లల తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు ఎప్పట్లాగే బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని అన్నారు. పిల్లల సంతోషం, వారి భవిష్యత్తే తామిద్దరి కామన్ ప్రయారిటీ అని చెబుతూ, ఈ వ్యక్తిగత పరిణామంలో తమ గోప్యతను గౌరవించాలని వారిద్దరూ కోరారు. కొద్ది…

Read More

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి సాధించిన వరుస గెలుపుల చారిత్రక విజయమే హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి అంచనాలను తలకిందులను చేస్తూ తిరుగులేని ప్రభంజనానని సృష్టించింది. ఈ భారీ విజయంపై ఈరోజు స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ..ఏపీ ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. మంచి పరిపాలన మంచి రాజకీయాలకు దారి తీస్తుంది అనే తను బలంగా నమ్మిన నమ్మకాన్ని ఇప్పుడు ప్రజలు మరోసారి నిజం చేశారని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సాధారణ ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి ప్రజల నుంచి కూటమికి లభించిన ఆదరణ మరింతగా పెరిగిందని, వైసీపీని మాత్రం ప్రజలు పూర్తిగా తిరస్కరించారని చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టణాలు, గ్రామాలునే తేడా ఏమాత్రం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు కూటమి వైపు నిలబడ్డారని తెలిపారు. ఈవీఎంల మోత మోగినా సరే, బ్యాలెట్…

Read More

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ గురించే చర్చ నడుస్తోంది. ఒక పంచాయతీ ఎన్నికలు ఒకటే పెండింగ్ ఉండటంతో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)పార్టీ ప్రకటననకు డెడ్ లైన్ దగ్గర పడతుండటంతో అందరి కళ్లూ 11వ తేదీ వైపే చూస్తున్నాయి. ఇటు పార్టీ ఆవిర్భావానికి డేట్ దగ్గర పడుతుండటంతో విజయసాయి రెడ్డి తన పొలిటికల్ స్పీడ్‌ను అమాంతం పెంచేశారు. ఒకవైపు సోషల్ మీడియాలో గ్రౌండ్ వర్క్‌ను నడిపిస్తూ, మొన్నటికి మొన్న ప్రత్యేకంగా ఒక ప్రచార సాంగ్ రిలీజ్ చేసి జనాల్లోకి దూసుకెళ్లిన ఆయన, ఇప్పుడు ఎక్స్ వేదికగా పెట్టిన పదునైన పోస్ట్‌తో రాజకీయాన్ని పూర్తిగా హీటెక్కించారు. నవంబర్ 11న ఉదయం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ-కన్వెన్షన్ వేదికగా తన కొత్త రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనుండటంతో..రోజురోజుకూ ఆయన వేస్తున్న అడుగులు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేవలం అనౌన్స్‌మెంట్‌తో సరిపెట్టకుండా ప్రజల్లోకి…

Read More

తమిళ నటుడు ధనుష్(Dhanush ) పొలిటికల్ ఎంట్రీపై కొద్దిరోజులుగా కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెయిన్‌గా ఆయన తన ఫ్యాన్ క్లబ్స్‌ను వెల్ఫేర్ అసోసియేషన్లుగా మార్చడం, భారీ ఎత్తున సభ్యత్వాల నమోదు చేపట్టడం అలాగే మహిళలకు ఇచ్చిన బహుమతులలో కమలం గుర్తు ఉండడంతో ధనుష్‌ను ఏకంగా ఒక నేషనల్ పార్టీ బ్యాక్ చేస్తోందనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. ఇలా వరుసగా తనపై వస్తున్న పొలిటికల్ రూమర్లపై ధనుష్ స్పందిస్తూ వాటన్నింటికీ చెక్ పెట్టారు. చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించిన తన లేటెస్ట్ మూవీ ఓమ్ ఆడియో రిలీజ్ వేదికగా ధనుష్(Dhanush ) మనసు విప్పి మాట్లాడారు. తన వెనుక పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారని, ఏదో ఒక రాజకీయ పార్టీ తనను నడిపిస్తోందని రకరకాల వార్తలు సృష్టిస్తున్నారని, కానీ అందులో ఎలాంటి నిజం కూడా లేదని తేల్చి చెప్పారు. తనను నడిపించేది పైన ఉన్న దేవుడు.. తన…

Read More

టాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందంటే దానిలో నటించే యాక్టర్ల గురించి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాటుహాటుగా చర్చ జరగడం సహజం. అలా ఇప్పుడు టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబోలో రాబోతున్న వర్కింగ్ టైటిల్ ఆర్‌సీ 17( RC17) చుట్టూనే ఇండస్ట్రీ వర్గాల చూపు పడింది. రంగస్థలం బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చరణ్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయంపై మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో మెగాభిమానులలో క్యూరియాసిటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ రేసులో మెయిన్‌గా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ధురంధర్ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించిన సారా అర్జున్ ఆల్మోస్ట్ సెలక్ట్ అయిపోయిందనే వార్తలు రాగా, మరోవైపు ఆకాశంలో ఒక తార ఫేమ్, తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేరును కూడా సుకుమార్…

Read More

తన సినీ కెరీర్, క్లాస్ ఆఫ్ 80స్ రీ-యూనియన్ అనుభవాలు, అలాగే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో నటించకపోవడానికి గల కారణాలను ఇంటర్వ్యూలో నటి ఖుష్బూ వెల్లడించింది. తెలుగు,తమిళ సినీ ఇండస్ట్రీలలో దశాబ్దాల తరబడి చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి ఖుష్బూ సుందర్..తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 80వ దశకపు నటీనటుల రీ-యూనియన్ గురించి మాట్లాడిన ఖుష్బూ.. తమ మధ్య ఉన్న అనుబంధం ఎంతో స్పెషల్ అని అన్నారు. క్లాస్ ఆఫ్ 80స్ పేరుతో 36 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని, దానిలో ప్రతిరోజూ అందరం మాట్లాడుకుంటామని చెప్పారు. ఈ గ్రూప్‌లో చిరంజీవి, రజనీకాంత్, వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ వంటి చాలా మంది దిగ్గజాలు ఉన్నారని, తామంతా కలిసినప్పుడు చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేస్తామని చెప్పారు. అయితే తెలుగులో వెంకటేష్ పక్కన…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5వ తేదీన ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్‌కు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు, బూత్ ఆక్రమణలు జరిగాయన్న విమర్శలు రావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బాధ్యులపై చర్యలను చేపడుతూనే మొత్తం 6 జిల్లాల పరిధిలోని 7 ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఓటింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈరోజు ఉదయం 7 గంటల నుంచే ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో సేకరించిన ఫిర్యాదులతో ఈరోజు రీపోలింగ్ కొనసాగుతోంది. దీనికితోడు తీవ్రమైన ప్రతికూల వాతావరణం, తుపాను ప్రభావం వల్ల కురిసిన వర్షాలతో నిన్న పోలింగ్ వాయిదా పడిన ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కూడా ఈరోజే…

Read More

ఏపీ వ్యాప్తంగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎలక్షన్ పోలింగ్ .. ఉద్రిక్తతలు, వర్షాల మధ్య నడుమ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు దాదాపు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు 31వేల460 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఇప్పటికే వేలాది స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు విపరీతంగా పెరిగిపోవడం ఆందోళనను కలిగిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఎర్రిపల్లెలో పోలింగ్ బూత్ దగ్గరలో పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడికి పాల్పడటంతో అక్కడ భయాందోళనలు వ్యక్తమయ్యాయి. లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో పోలింగ్ ఏజెంట్ల వివాదం చోటుచేసుకోగా, అక్కడికి చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డిని అధికారులు, పోలీసులు…

Read More