తమిళ నటుడు ధనుష్(Dhanush ) పొలిటికల్ ఎంట్రీపై కొద్దిరోజులుగా కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెయిన్‌గా ఆయన తన ఫ్యాన్ క్లబ్స్‌ను వెల్ఫేర్ అసోసియేషన్లుగా మార్చడం, భారీ ఎత్తున సభ్యత్వాల నమోదు చేపట్టడం అలాగే మహిళలకు ఇచ్చిన బహుమతులలో కమలం గుర్తు ఉండడంతో ధనుష్‌ను ఏకంగా ఒక నేషనల్ పార్టీ బ్యాక్ చేస్తోందనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. ఇలా వరుసగా తనపై వస్తున్న పొలిటికల్ రూమర్లపై ధనుష్ స్పందిస్తూ వాటన్నింటికీ చెక్ పెట్టారు.
చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించిన తన లేటెస్ట్ మూవీ ఓమ్ ఆడియో రిలీజ్ వేదికగా ధనుష్(Dhanush ) మనసు విప్పి మాట్లాడారు. తన వెనుక పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారని, ఏదో ఒక రాజకీయ పార్టీ తనను నడిపిస్తోందని రకరకాల వార్తలు సృష్టిస్తున్నారని, కానీ అందులో ఎలాంటి నిజం కూడా లేదని తేల్చి చెప్పారు. తనను నడిపించేది పైన ఉన్న దేవుడు.. తన వెన్నంటి ఉండేది తన అభిమానులు..తనను ఆదరించేది ప్రజలు మాత్రమే. ఇంతకు మించి తన వెనుక ఏ శక్తులు లేవంటూ చాలా ఎమోషనల్‌గా క్లియర్ మెసేజ్‌ను ఇచ్చారు.
ఇక ధనుష్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అలాగే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, యంగ్ సెన్సేషన్ శ్రీలీల లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ ‘ఓమ్’ నవంబర్ 20న గ్లోబల్ వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. అయితే, ఈ ఆడియో ఫంక్షన్ వేదిక వద్ద ఊహించని విధంగా భారీగా జనం తరలిరావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
వేలాది మంది అభిమానులు ఈ ఆడియో ఫంక్షన్ కోసం చెల్లుబాటు అయ్యే పాస్‌లు చేతిలో ఉన్నా లోపలికి వెళ్లలేక చాలా ఇబ్బందులు పడ్డారు. దీనిపై ధనుష్ రెస్పాండ్ అవుతూ జరిగిన పొరపాటుకు పూర్తి బాధ్యత తనదేనని ఒప్పుకుంటూ.. సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
