రాజకీయాల్లో ఎప్పుడూ దూసుకెళ్తూ, అటు సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉండే జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వ్యక్తిగత జీవితంలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన సతీమణి అన్నా కొణిదెలతో డైవోర్స్ తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన పవన్.. అందరికీ గట్టి షాక్ ఇచ్చారు.
దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అన్నా లెజినోవా ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. జీవితంలో ఎంతోకాలం కలిసి ప్రయాణించినా కూడా, పరస్పర అంగీకారం, మెచ్యూరిటీతోనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నామని వారు ఆ నోట్లో స్పష్టం చేశారు. మా దారులు వేరైనా సరే, విడిపోయినా మంచి ఫ్రెండ్స్‌గానే కొనసాగుతామని, పిల్లల తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు ఎప్పట్లాగే బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని అన్నారు.
పిల్లల సంతోషం, వారి భవిష్యత్తే తామిద్దరి కామన్ ప్రయారిటీ అని చెబుతూ, ఈ వ్యక్తిగత పరిణామంలో తమ గోప్యతను గౌరవించాలని వారిద్దరూ కోరారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, హిందూ సాంప్రదాయాల గురించి పోస్టులు పెడుతూ వచ్చిన అన్నా లెజినోవా సడన్‌గా..ఈమధ్య తన సోషల్ మీడియా అకౌంట్‌ను డీయాక్టివ్ చేయడంపైనే రకరకాల చర్చలు నడిచాయి.
ఇప్పుడు ఈ డైవోర్స్ ప్రకటన వెలువడటంతో ఆ సందేహాలన్నింటికీ కూడా తెరపడింది. గతంలో ఇప్పటికే రెండు పెళ్లిళ్లు, ఆ తర్వాత విడాకులతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన పవన్ లైఫ్‌లో ..మళ్లీ జరిగిన ఈ తాజా పరిణామం చూసి ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో దూసుకుపోతూ, తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఈ భారీ నిర్ణయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
