టాలీవుడ్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందంటే దానిలో నటించే యాక్టర్ల గురించి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాటుహాటుగా చర్చ జరగడం సహజం. అలా ఇప్పుడు టాలీవుడ్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబోలో రాబోతున్న వర్కింగ్ టైటిల్ ఆర్సీ 17( RC17) చుట్టూనే ఇండస్ట్రీ వర్గాల చూపు పడింది. రంగస్థలం బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చరణ్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయంపై మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో మెగాభిమానులలో క్యూరియాసిటీ రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ మూవీలో హీరోయిన్ రేసులో మెయిన్‌గా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ధురంధర్ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించిన సారా అర్జున్ ఆల్మోస్ట్ సెలక్ట్ అయిపోయిందనే వార్తలు రాగా, మరోవైపు ఆకాశంలో ఒక తార ఫేమ్, తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేరును కూడా సుకుమార్ టీమ్ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రాండ్‌గా జరిగిన ముహూర్తపు పూజా కార్యక్రమంలోనే హీరోయిన్ ఎవరనే దానిపైన కూడా మేకర్స్ క్లారిటీ ఇస్తారని అంత భావించారు.
అయితే సారా అర్జున్, సాత్విక వీరవల్లి పేర్లను సుక్కు టీమ్ షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలోనే ఒకరిని ఫైనల్ చేసే అవకాశం బలంగా ఉన్నా కూడా, ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం. నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ మొదటి వారంలో హీరోయిన్ ఎవరనే దానిపైన సుకుమార్ ఒక క్లారిటీకి రానున్నారట.
ఇక రీసెంట్గా హైదరాబాద్ వేదికగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఆర్సీ 17( RC17) మూవీ పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ..తనత తనయుడు రామ్ చరణ్‌పై మొదటి షాట్‌కు క్లాప్ కొట్టారు. ఆ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో నెమలి పింఛం బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ ఫేస్ లుక్ డిజైన్ చేయడంతో మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందనే దానిపై నెట్టింట్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని 2027 ఫిబ్రవరి నుంచి ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
