నితేష్ తివారీ డైరెక్షన్లో వచ్చిన రామాయణం బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల మైలురాయి దిశగా వేగంగా సాగుతోంది. దీపావళి సందర్భంగా నవంబర్ 5వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే మూడో వారంలోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని చోట్ల కలెక్షన్లు కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం కూడా వసూళ్ల స్పీడ్‌పై ఎఫెక్ట్ చూపించిందన్న చర్చ నడిచింది. దీంతో ఆడియన్స్‌ను మళ్లీ థియేటర్లకు రప్పించడానికి మేకర్స్ టికెట్ ధరలను భారీగా తగ్గించారు. నవంబర్ 24వ తేదీ మంగళవారం కార్తీక పౌర్ణమి రోజు నుంచి రూ.99కే సినిమా టికెట్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ముంబై, ఢిల్లీ వంటి…
Author: Sai Durga
ఏపీలో కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. పైస్థాయిలో మూడు పార్టీల నేతలు ఐక్యతను ప్రదర్శిస్తున్నా కూడా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే చర్చ ఎప్పటినుంచో వినిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జనసేన నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న పరిణామాలు పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మిత్రపక్షంగా ఉన్నా కూడా టీడీపీ నుంచి తగిన గౌరవం దక్కడం లేదని జనసేన శ్రేణులు భావిస్తున్నాయనే అభిప్రాయాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. గతంలో పోరాడిన పార్టీకి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు? వైసీపీ అధికారంలో ఉన్న టైమ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు చాలా ప్రాంతాల్లో పోటీకి దిగారు. అప్పట్లో ఎదురైన పొలిటికల్ ఒత్తిళ్లను తట్టుకుని మరీ తమ పార్టీ అభ్యర్థుల తరఫున పోరాడారని జనసేన నాయకత్వం చాలా సార్లు చెప్పింది. ఆ సమయంలో పార్టీ సాధించిన విజయాలను పవన్ కళ్యాణ్…
5 దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు ఓటీటీ వేదికపైన కూడా తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. నెట్‌ఫ్లిక్స్ కోసం చిరు హోస్ట్ చేస్తున్న చిరంజీవి’స్ మెగావర్స్ టాక్ షో ప్రోమో ఈరోజు విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రోమోలో ఇది నా అడ్డా అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్, అలాగే పేరులోని ‘N’ అక్షరం మిస్ అవ్వడం ద్వారా నెక్స్ట్ నెట్‌ఫ్లిక్స్ అనే సింబల్ ఇవ్వడం అభిమానులను అలరిస్తోంది. ఈ టాక్ షోలో మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా సరదాగా, కామెడీ యాంగిల్లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా, క్రీడలు, పాపులర్ కల్చర్ రంగాలకు చెందిన సెలబ్రెటీలతో ఆయన చేసే చర్చలు ఈ షోకు మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, బ్రహ్మానందం, సందీప్ రెడ్డి వంగా, రవితేజ, నాని, బాబీ కొల్లి వంటి స్టార్లు గెస్టులతో…
ఏపీ రాజకీయాల్లోనే కాకుండా వైఎస్ కుటుంబంలో కూడా కలకలం రేపుతున్న బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆస్తి వివాదం మరోసారి పీక్స్‌కు చేరింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హఠాత్తుగా బెంగళూరులో ల్యాండ్ అవ్వడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్యాలెస్ ప్రాంగణంలోకి షర్మిల ప్రవేశించకుండా అడ్డుకోవడానికి స్థానిక పోలీసులు భారీ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించడం రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. యలహంక ప్యాలెస్ ఆస్తి తగాదాకు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతినిధిగా భీమిశెట్టి రమేష్ బాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2007లోనే వైఎస్ భారతి తల్లి సుగుణమ్మ ఈ ప్యాలెస్‌ను తమ కంపెనీకి 20 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అక్కడ తోటల పెంపకం, లగ్జరీ గెస్ట్ హౌస్‌ల నిర్మాణంతో పాటు ఆస్తి ఆధునీకీకరణ కోసం తాము కోట్ల…
హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ మైసా విడుదల లాస్ట్ మినిట్‌లో వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే థియేట్రికల్ రన్‌కు సరిగ్గా ఐదు రోజుల ముందు మేకర్స్ ఊహించని రీతిలో రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో రష్మిక అభిమానులు నిరాశకు గురయ్యారు. దర్శకుడు రవీంద్ర పుల్లే , నిర్మాణ సంస్థ ‘అన్‌ఫార్ములా ఫిల్మ్స్’ సోషల్ మీడియా వేదికగా దీనిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం విజువల్ ప్రమాణాల్లో కొత్త శిఖరాలను అందుకుంటోందని, అదే స్థాయిలో ‘మైసా’ మూవీని కూడా ఏమాత్రం రాజీ లేకుండా భారీ యాక్షన్ విజువల్స్‌తో తెరకెక్కించడానికే ఈ సమయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పెద్ద తెరపై ఆడియన్స్‌కు ఒక గొప్ప అనుభూతిని అందించడమే తమకు ముఖ్యమని వివరించారు. కొత్త రిలీజ్…
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి మెయిన్ హీరోయిన్గా నటించగా, డింపుల్ హయతీ, నివేదా పేతురాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఎన్నో వాయిదాల తర్వాత అక్టోబర్ 30వ తేదీన ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ ఆదర్శ కుటుంబం మూవీ, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆకట్టుకుని మంచి వసూళ్లను రాబట్టింది. వెంకటేష్ యాక్షన్, త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్ మూవీ విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పటికీ చాలా కేంద్రాలలో థియేట్రికల్ రన్ కొనసాగిస్తున్న ఆదర్శ కుటుంబం మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ హక్కులను ఫేమస్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి అంటే దాదాపు రూ.40 కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో…
ఏపీలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఈ స్థానిక సమరంలో పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి బరిలో నిలబడొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు క్లిష్టంగా మారడం, కొన్నిచోట్ల తమకు కేటాయింపులు దక్కలేదని జనసైనికులు అసంతృప్తి చెందడం వంటి పరిణామాలతో పవన్ కళ్యాణ్ ఈ ఫ్రీ హ్యాండ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. పంచాయతీ ఎలక్షన్స్ రాజకీయ పార్టీల గుర్తులపై కాకుండా లోకల్ బాడీస్ బలోపేతమే లక్ష్యంగా జరుగుతాయని పవన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు, సీట్ల సద్దుబాట్లు ఉండవని, ఎవరైనా స్వేచ్ఛగా పోటీ చేయడానికి పొలిటికల్‌గా ఎలాంటి అడ్డంకులు ఉండబోవని పవన్ తేల్చిచెప్పారు. పోటీ చేయాలనుకునే శ్రేణులను ఏ లీడర్ అడ్డుకోకూడదని, ప్రజాస్వామ్యయుత స్వేచ్ఛాపూరిత…
ఒకప్పుడు ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని వాటికి వెల్కమ్ చెప్పేవారు. అయితే ఇప్పుడు డేటా సెంటర్లు వస్తామంటున్నా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాటికి కావాల్సిన పవర్, నీటి వినియోగం, పర్యావరణ ప్రభావమే కారణం. మరోవైపు అమెరికాలో డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ప్రజల నుంచి నిరసనలు పెరుగుతున్నాయి. 2026 మధ్యంతర ఎన్నికల్లోనూ ఈ అంశం పొలిటికల్ చర్చగా మారింది. కొన్ని ప్రాంతాల్లో డేటా సెంటర్ల నిర్మాణాన్ని పరిమితం చేయాలన్న ప్రతిపాదనలకు ఓటర్లు సపోర్ట్ తెలిపారు. ఇదే టైమ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తమ దేశ కంపెనీలు విదేశాల్లో డేటా సెంటర్లను నిర్మిస్తే భారీ పన్ను విధిస్తామని ప్రకటించారు. అంటే ఒకవైపు ప్రజల వ్యతిరేకత.. మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో భారీ డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమేనా? వాటితో ఆంధ్రప్రదేశ్‌కి నిజంగా ఎంత ప్రయోజనం ఉంటుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ట్రంప్…
వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తుల చర్చలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బెంగళూరు కోర్టులో ఊహించని న్యాయపరమైన చిక్కు ఎదురైంది. బెంగళూరు నార్త్ తాలూకా, జాలా హోబ్లీ పరిధిలోని కట్టిగేనహళ్లి ఊరిలో ఉన్న ఒక ఆస్తికి సంబంధించి దేవనహళ్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు..నవంబర్ 21వ తేదీ శనివారం కీలక ఆదేశాలను జారీ చేసింది. సదరు వివాదాస్పద ప్రదేశంలోకి షర్మిల కానీ, ఆమె కుటుంబ సభ్యులు లేదా షర్మిల తరఫున ప్రతినిధులు కానీ ఎవరూ ప్రవేశించకుండా మధ్యంతర ఇంజక్షన్ ఉత్తర్వులను వెలువరించింది. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సివిల్ దావాను కోర్టులో పిటిషన్‌గా దాఖలు చేసింది. సదరు భూమిని తాము 2007 మార్చి 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు అంటే 20 సంవత్సరాల కాలానికి లీజుకు తీసుకున్నామని, దీని ప్రకారం తాము రెగ్యులర్‌గా అద్దె చెల్లిస్తూ పవర్ బిల్లులు…
పశ్చిమ బెంగాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సాంకేతిక విద్య, శాస్త్రీయ పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో 75 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈ సంస్థ దేశంలోనే తొలి ఐఐటీగా గుర్తింపు పొందింది. 1951లో స్థాపించిన ఐఐటీ ఖరగ్‌పూర్ దేశ ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వివిధ రంగాలకు నైపుణ్యం కలిగిన నిపుణులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.ఈ వేడుకల్లో భాగంగా సంస్థ 75 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ మోదీ ప్రత్యేక స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. విద్య, పరిశోధన, సాంకేతిక అభివృద్ధి ద్వారా దేశ పురోగతికి ఐఐటీ ఖరగ్‌పూర్ అందించిన సేవలను ఈ కార్యక్రమం గుర్తుచేసింది. ’75 వాయిసెస్ ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి 75 మంది విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలు, ఆలోచనలు, దేశ భవిష్యత్తు అభివృద్ధిపై…